ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచినట్లు తెలుస్తోంది ? అలాగే కొత్త అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాయి, దేవరాజ్ ఇద్దరితోనూ శ్రావణి సన్నిహితంగా ఉండేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

మొదట శ్రావణి సాయిని ఇష్టపడినా… ఆ తర్వాత.. దేవరాజుతో ప్రేమ వ్యవహారం సాగించిందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. దేవరాజ్ పరిచయం అయిన కొన్నాళ్లకే అతడితో పీకల్లోతు  ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.దేవరాజ్ పై కుటుంబసభ్యులు కేసు పెట్టినా శ్రావణికి అతనిపై ప్రేమ తగ్గలేదు. కుటుంబ సభ్యులకు తెలియకుండా దేవరాజ్ తో సన్నిహితంగా మెలిగేది.విచారణలో వెలుగు చూస్తున్న విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో జైలు నుంచి విడదలయ్యాక దేవరాజ్ శ్రావణిని కలిసినట్లు తెలిసింది. అదే సమయంలో… వీళ్లిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియకుండా శ్రావణి జాగ్రత్త పడింది. అయితే.. దేవరాజ్‌పై ఆగ్రహంతో ఉన్న ఆమె కుటుంబీకులను దేవరాజ్ బెదిరించేవాడు.

శ్రావణిని రోడ్డుకీడుస్తానంటూ హెచ్చరించాడు. దీంతో… ఇదే విషయంపై శ్రావణి దేవరాజ్‌ను నిలదీసింది. వీడియోల గురించి ప్రశ్నించింది. ఇక శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు… వీళ్లిద్దరూ శ్రీకన్య హోటల్‌కు వెళ్లారు. అక్కడికి సాయి రావడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రావణితో కలిసి ఆమె కుటుంబ సభ్యులు దేవరాజ్ వద్దకు వెళ్లారు.శ్రావణికి చెందిన వీడియోలు, ఫోటోల గురించి అతడితో ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో దేవరాజ్ పై శ్రావణి కుటుంబ సభ్యులు భౌతిక దాడి చేశారు. దీంతో అతను శ్రావణి తల్లి తండ్రులపై పంజా గుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా….శ్రావణి తల్లితండ్రులు ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్‌.ఆర్‌నగర్‌ పోలీసులు దేవరాజ్‌పై 354 కింద కేసు నమోదు చేసారు.

మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసు.. మిస్టరీగా మారిన వేళ.. ఆమె చేసిన వీడియోలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో శ్రావణిని వేధించింది సాయినా ? లేక దేవరాజ్‌రెడ్డా ? అన్న అనుమానం వ్యక్తమైన వేళ.. శ్రావణి చేసిన వీడియో.. పోలీసులకు కీలకంగా మారింది.దేవరాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా శ్రావణి ఓ వీడియో చేసింది. అందులో మై లవ్‌లీ హీరో అంటూ దేవరాజ్‌ను సంభోదించింది. అలాగే దేవరాజ్‌పై తనకున్న అభిమానాన్ని ఆ వీడియోలో చెప్పింది.

Related Posts