లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

టెంపరేచర్ స్టిక్కర్లు.. కరోనా జ్వరం ఉందో లేదో సెకన్లలో చెప్పేస్తాయి!

Published

on

Temperature stickers : అసలే కరోనా కాలం.. అందులోనూ చలికాలం.. అంటువ్యాధుల వ్యాధికి అనుకూలమైన సమయం.. అందుకే జాగ్రత్తగా ఉండాలనేది.. భౌతిక దూరంతో పాటు ముఖానికి మాస్క్ కూడా తప్పనిసరి… కరోనా కాలంలో కొంచెం జ్వరంగా ఒళ్లు వేడిగా అనిపించినా వామ్మో కరోనా వచ్చిందేమోనని భయపడిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు శరీరం ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటే మాత్రం.. వారికి నో ఎంట్రీ బోర్డులే దర్శనమిస్తుంటాయి. ఎందుకైనా మంచిది అది కరోనా జ్వరమో లేదా మాములూ జ్వరమో తెలియడం కష్టంగా మారుతోంది. వారిని థర్మల్ స్ర్కీనింగ్ చేస్తేగాని తెలియని పరిస్థితి. అందుకే ఇప్పుడు టెంపరేచర్ స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చేశాయ్..అవే.. విజువల్ టెంపరేచర్ ఇండికేటర్ (VTi) అని పిలుస్తారు. సెకన్ల వ్యవధిలో మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తాయి.. జ్వరంగా ఉంటే రెడ్ కలర్ సిగ్నల్, జ్వరం లేకుంటే గ్రీన్ కలర్ సిగ్నల్ వస్తుంది. గత మూడు నెలలుగా ఉత్తర అమెరికాలో ఈ Temperature Stickers హోం కేర్ టెస్టింగ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది క్రిస్మస్ నాటికి టెంపరేచర్ స్టిక్కర్లను అన్ని కేర్ సెక్టార్ లలో అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్టిక్కర్ ధర (24P) మాత్రమే.. ఈ టెంపరేచర్ స్టిక్కర్లను కరోనావైరస్ కేసులను సులభంగా గుర్తించేందుకు ఉపయోగడపతాయి.
Temperature stickers

శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే.. కరోనా సోకిందనడానికి ప్రధాన లక్షణాల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదో చెక్ చేసేందుకు ఈ టెంపరేచర్ స్టిక్కర్లను వాడొచ్చు. ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ వంటి అన్ని వ్యాక్సిన్లలో అధిక జ్వరం రావడాన్ని దుష్ప్రభావంగా పరిగణిస్తారు.ఇంతకీ ఈ టెంపరేచర్ స్టిక్కర్లు ఎలా పనిచేస్తాయంటే.. సర్కిల్ ఆకారంలో ఉండే ఈ టెంపరేచర్ ప్లస్ డిస్క్‌లను నుదిటిపై అతికించుకోవాలి. శరీర ఉష్గోగ్రతను సులభంగా గుర్తించగలవు.. జ్వరం లేకుంటే మాత్రం గ్రీన్ కలర్ లోనే కనిపిస్తాయి. అదే శరీర ఉష్టోగ్రత సాధారణంగా కంటే ఎక్కువగా లేదా జ్వరంగా ఉన్నప్పుడు నుదిటిపై అంటించిన స్టిక్కర్లు వెంటనే వేడిక్కి రెడ్‌గా మారిపోతాయి. శరీరంలో ఉష్ణోగ్రత 37.5C లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే ఈ టెంపరేచర్ స్టిక్కర్లు గ్రీన్ నుంచి రెడ్ కలర్ లోకి మారిపోతాయి.సాధారణ టెంపరేచర్ చెకర్ల కంటే ఈ VTi డిస్క్ టెంపరేచర్ స్టిక్కర్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఒక వ్యక్తి శరీర ఉష్టోగ్రత ఆకస్మాత్తుగా మారిన వెంటనే వీటి VTi డిస్క్ కలర్ మారిపోతుంది. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 37.5C కంటే తక్కువకు పడిపోతే వెంటనే డిస్క్ కలర్ రెడ్ నుంచి గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టెంపరేచర్ స్టిక్కర్లు వాడటం ద్వారా కరోనా కేసులను వెంటనే నిర్ధారించడంతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా కంట్రోల్ చేయొవచ్చునని చెబుతున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ స్టిక్కర్ల సాయంతో అనారోగ్యంగా ఉన్నారో లేదా సులభంగా గుర్తించవచ్చు.