సోమవారం నుంచి మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాలు రీఓపెన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Temples, Other Places Of Worship To Reopen In Maharashtra మహారాష్ట్రలో సోమవారం(నవంబర్-16,2020)నుంచి ఆలయాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించనున్నట్లు మహావికాస్ అఘాడి ప్రభుత్వం తెలిపింది.

కరోనా నేపథ్యంలో ఆలయాలు లేదా ప్రార్థనామందిరాల్లో అనుసంచరించాల్సిన కరోనావైరస్ భద్రతా నిబంధనలు మరికొన్ని గంటల్లోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఇతర రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్రలో కూడా ప్రార్థనామందిరాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే,మహారాష్ట్రలో ఆలయాలను తిరిగి ప్రారంబించాలంటూ మహారాష్ట్రలోని విపక్ష బీజేపీ క్యాంపెయిన్ లను నిర్వహిస్తోంది. బీజేపీ క్యాంపెయిన్ కి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కూడా మద్దుతుగా నిలిచారు.

Related Tags :

Related Posts :