లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్

Published

on

temporary medical jobs in south central railway

దక్షిణ మధ్య  రైల్వే ఆస్పత్రుల్లోని  కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్‌ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్‌ అటెండెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

సెంట్రల్‌ హాస్పిటల్‌, లాలాగూడ, సికింద్రాబాద్‌ రైల్వే ఆస్పత్రుల్లో సేవల కోసం ఈ నియామకాలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులు www.scr.indianrailways.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 15 వరకు విధించారు. వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం చేపట్టనున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ 9701370624. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *