Tenali RamaKrishna BA.BL hitting screens this November

‘తెనాలి రామకృష్ణ BA.BL’ షూటింగ్ పూర్తి : నవంబర్‌ విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సందీప్ కిషన్, హన్సిక జంటగా, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. నవంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది..

సందీప్ కిషన్, హన్సిక జంటగా, ‘సీమశాస్త్రి’, ‘సీమటపాకాయ్’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. (కేసులు ఇవ్వండి ప్లీజ్).. అనేది ట్యాగ్ లైన్.. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

‘పందెంకోడి 2’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నవంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో ‘తెనాలి రామకృష్ణ BA.BL’ రిలీజ్ కానుంది. 

Read Also : ‘అనుకోని అతిథి’ సెన్సార్ పూర్తి – నవంబర్ 15 విడుదల

పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ, అన్నపూర్ణ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కథ : రాజసింహా, మాటలు : భవానీ ప్రసాద్, నివాస్, సంగీతం : సాయి కార్తీక్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, లిరిక్స్ : భాస్కరబట్ల, చిలక రెక్క గణేష్, డ్యాన్స్ : శోభి, ప్రేమ్ రక్షిత్, ఫైట్స్ : వెంకట్, సమర్పణ : రామాంజనేయులు, నిర్మాతలు : అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూప జగదీశ్‌.

 

Related Tags :

Related Posts :