Tenali Ramakrishna BA.BL - Movie Review

తెనాలి రామకృష్ణ BA.BL – రివ్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సందీప్ కిషన్, హన్సిక జంటగా.. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ తెనాలి రామకృష్ణ BA.BL – రివ్యూ..

సందీప్ కిషన్.. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా.. రెండో, మూడో తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి. అయినా పట్టువదలకుండా తమిళ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య నిర్మాతగా చేసిన ‘నిను వీడని నీడను నేనే’  సినిమా సందీప్ కెరీర్‌కి ఊపిరిలూదింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘తెనాలి రామకృష్ణ BA.BL’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

డైరెక్టెర్ జి.నాగేశ్వర రెడ్డికి కూడా ఈ సినిమా ఇంపార్టెంట్ కావడంతో ఈ ఇద్దరు కలిసి ఎలాంటి ప్రొడక్ట్ డెలివర్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉండడం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌తో హింట్ ఇచ్చినట్టు నవ్వించిందా? లేక కామెడీ పేరుతో విసిగించిందా.. అనేది ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే :

కర్నూలులో ఓ బలమైన రాజకీయ నేతగా ఎదగాలనుకున్న వరలక్ష్మీని తన అక్రమాస్తులకు సంబంధించి.. ఆధారాలు సేకరించిన ఓ జర్నలిస్ట్‌ను హత్య చేస్తుంది. తాను ఆ హత్య చేయలేదని.. ప్రత్యర్ధులే చేశారని కుట్రపన్ని, ఆ కేసు నుంచి బయట పడటానికి క్రిమినల్ లాయర్ చక్రవర్తిని ఆశ్రయిస్తుంది. ఈ క్రమంలో లాయర్ అయిన తెనాలి రామకృష్ణ జిల్లా కోర్ట్‌లో సివిల్ కేసులను కాంప్రమైజ్ చేస్తూ.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. క్రిమినల్ లాయర్ చక్రవర్తి కూతురైన రుక్మిణిని తెనాలి రామకృష్ణ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఈ క్రమంలో క్రిమినల్ లాయర్ చక్రవర్తి, వరలక్ష్మి ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపి వరలక్ష్మిని జైలుకు పంపించే ప్రణాళిక వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నతెనాలి రామకృష్ణ తాను మంచిది అనుకుంటున్న వరలక్ష్మిని కాపాడాడా.. నిజంగానే వరలక్ష్మి జైలుకు వెళ్లిందా.. లేదా అనేది తెరమీద చూసి తెలుసుకోవలసిందే..

Read Also : యాక్షన్ – రివ్యూ

 

నటీనటులు విషయానికి వస్తే :

సందీప్ కిషన్ ఎప్పటిలాగే.. తన క్యారెక్టర్‌ను 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పండించాడు. కామెడీ చేస్తూ.. ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ హన్సిక ప్రాధాన్యత లేని పాత్ర పోషించినా.. లుక్స్ పరంగా మెప్పించింది. పాటలలో చాలా గ్లామర్‌గా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ తన పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించింది. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ, రఘుబాబు, అశోక్ కుమార్, ప్రదీప్ కుమార్  తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక వెన్నెల కిషోర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ కామెడీ కొన్ని చోట్ల వెగటుగా అనిపించినా.. ఓవరాల్‌గా పర్వాలేదనిపిస్తుంది. 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే :

క్సెస్ కోసం నానా తంటాలు పడుతోన్న డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి తనుకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌ను నమ్ముకుని మంచి కథతో తెనాలి రామకృష్ణను తెరకెక్కించాడు. అయితే సినిమాను తను అనుకున్న స్థాయిలో తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. కొంత రొటీన్ కామెడీతో కితకితలు పెట్టాలని ప్రయత్నం చేశాడు. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ పర్వాలేదు అనిపించే సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా రెండు పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాకు రిచ్ లుక్ తెచ్చే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ మెప్పించింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది.

ఓవరాల్‌గా చెప్పాలి అంటే.. ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకు వస్తోన్న సందీప్ కిషన్‌కు ఈ సినిమా ఓ మోస్తరు రిజల్ట్‌ ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్‌హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బాగానే ఉన్నా, సెకండ్‌హాఫ్ ఈ సినిమా ఫలితం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్స్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి.. ఈ సినిమాకు అది కలిసొచ్చే అవకాశం అవుతుంది.
 

Related Tags :

Related Posts :