Tenali Ramakrishna BA.BL Releasing on 15th November

నవంబర్‌ 15న ‘తెనాలి రామకృష్ణ BA.BL’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్.. ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. (కేసులు ఇవ్వండి ప్లీజ్).. నవంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది..

సందీప్ కిషన్, హన్సిక జంటగా, ‘సీమశాస్త్రి’, ‘సీమటపాకాయ్’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. (కేసులు ఇవ్వండి ప్లీజ్).. ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోస్ అండ్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. నవంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో ‘తెనాలి రామకృష్ణ BA.BL’ రిలీజ్ కానుంది. పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ, అన్నపూర్ణ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. 

Read Also : ‘పతీ, పత్నీ ఔర్ వో’ : ట్రైలర్

కథ : రాజసింహా, మాటలు : భవానీ ప్రసాద్, నివాస్, సంగీతం : సాయి కార్తీక్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, లిరిక్స్ : భాస్కరబట్ల, చిలక రెక్క గణేష్, డ్యాన్స్ : శోభి, ప్రేమ్ రక్షిత్, ఫైట్స్ : వెంకట్, సమర్పణ : రామాంజనేయులు, నిర్మాతలు : అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీశ్.
 

Related Posts