Tenali RamaKrishna BABL Shoot Begins-10TV

తెనాలి రామకృష్ణుడు-స్టార్టయ్యాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సందీప్ కిషన్, హన్సికల ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ షూటింగ్ ప్రారంభం.

సందీప్ కిషన్, హన్సిక జంటగా, సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం వంటి కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై, అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా కర్నూలులో స్టార్ట్ అయ్యింది. 
 

ఓ మోస్తరు మార్కులతో పాసైనా, అద్భతమైన తన తెలివి తేటలతో ఎటువంటి క్లిష్టమైన కేసునైనా సాల్వ్ చేసే కుర్రాడిగా సందీప్ ఈ సినిమాలో కనిపిస్తాడట. పందెంకోడి 2, సర్కార్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సందీప్ చేస్తున్న కామెడీ మూవీ ఇదే.

ఈ సినిమాకి సంగీతం : శేఖర్ చంద్ర, కెమెరా : సాయి శ్రీరామ్, సమర్పణ : ఇందుమూరి శ్రీనివాసులు, సహ నిర్మాతలు : రూప జగదీష్, వి.మహేశ్వర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సీతారామరాజు మల్లెల.

Related Tags :

Related Posts :