Tenali Ramakrishna BA.BL Trailer

తెనాలి రామకృష్ణ BA.BL – ట్రైలర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. (కేసులు ఇవ్వండి ప్లీజ్).. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్, హన్సిక జంటగా, ‘సీమశాస్త్రి’, ‘సీమటపాకాయ్’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’.. (కేసులు ఇవ్వండి ప్లీజ్).. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

‘పందెంకోడి 2’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నవంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో ‘తెనాలి రామకృష్ణ BA.BL’ రిలీజ్ కానుంది.

Read Also : అశోక్ గల్లా ఫస్ట్‌లుక్ : మహేశ్ విషెస్

పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ, అన్నపూర్ణ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ సినిమాకి కథ : రాజసింహా, మాటలు : భవానీ ప్రసాద్, నివాస్, సంగీతం : సాయి కార్తీక్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, లిరిక్స్ : భాస్కరబట్ల, చిలక రెక్క గణేష్, డ్యాన్స్ : శోభి, ప్రేమ్ రక్షిత్, ఫైట్స్ : వెంకట్, సమర్పణ : రామాంజనేయులు, నిర్మాతలు : అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్రెడ్డి, రూప జగదీశ్.
 

Related Posts