Home » చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
Published
2 months agoon
By
bheemrajroad accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.
మృతులు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్-జీజాపూర్ రహదారిపై మల్కాపూర్ గేట్ సమీపంలో ఘటన చేటుచేసుకుంది.
ఏపీ 09ఏజెడ్ 3896 నెంబర్ గల ఇన్నావో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్ శివారులోని మూలమలుపు వద్ద ఇవాళ ఉదయం ఎదురుగా వస్తున్న విజయ బోర్ వెల్ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందారు. కారులో మరికొంతమంది ఇరుక్కపోవడంతో పోలీసులు వారిని బయటకు తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.