లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఈ హీరోయిన్‌ని ఎప్పుడూ ఇలా చూసుండరు!

రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ధారిగా రూపొందుతోన్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘నేనే నా..?’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

Published

on

A terrific first look of the stunning  Regina Cassandra's Nene Naa..

రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ధారిగా రూపొందుతోన్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘నేనే నా..?’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`తో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  విడుద‌ల చేశారు. ఇనుప చువ్వ‌ల మ‌ధ్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా లుక్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా..యాపిల్ ట్రీ స్టూడియోస్ అధినేత‌, నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ : “మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?’ సినిమాను కార్తీక్ రాజు గారు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్‌ మా సినిమాలోని రెజీనా లుక్‌ను విడుద‌ల చేశారు. ఆయ‌నకు మా యూనిట్ త‌ర‌పున స్పెష‌ల్ థ్యాంక్స్‌. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. న‌టిగా ఆమెను మ‌రో యాంగిల్‌లో ఆవిష్క‌రింపచేసే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతాన్ని.. పీకే వర్మ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

A terrific first look of the stunning  Regina Cassandra's Nene Naa..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *