లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

కరోనా నుంచి కోలుకున్నా.. షూటింగ్‌కు వచ్చేస్తా: రామ్ చరణ్

Published

on

కరోనా పాజిటివ్ వచ్చిన కొద్దిరోజుల్లోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మహమ్మారిని జయించారు. ఈ మేరకు ఆ గుడ్ న్యూస్‌ని మంగళవారం అభిమానులతో పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో తాజా టెస్టుల్లో తనకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. సెట్స్‌లో ఎప్పుడు అడుగుపెట్టాలా? అని ఎదురుచూస్తున్నా అనే సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తను రికవరీ కోసం కోలుకుని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. చరణ్‌కు డిసెంబర్‌ 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు కరోనా సంకెళ్లు తెంచుకోవడంతో శరవేగంగా షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో వరుణ్‌ తేజ్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

రామ్‌చరణ్.. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే జక్కన్న ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రలో ఆకట్టుకోనున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరో అజయ్‌ దేవ్‌గన్ సినిమాలో ట్విస్టింగ్ అయ్యే పాత్రలో కనిపించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *