అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేసేస్తాడు.. తెవాటియాపై సెహ్వాగ్ ప్రశంసలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్ 2020లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన యువ కెరటం రాహుల్ తెవాటియా.. రాజస్థాన్ నెగ్గిన రెండు మ్యాచ్‌లలో కీలక పాత్ర అతనిదే. అటువంటి రాహుల్ తెవాటియా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుపై అనూహ్య రీతిలో ఓడిపోతుంది అనుకున్న జట్టును చివరి నిమిషంలో రాహుల్‌ తివాటియా గెలిపించాడు.. తర్వాత మరో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కూడా 26బంతుల్లో 42పరుగులు చేసి.. మ్యాచ్ గెలిపించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచిన మూడు మ్యాచ్‌లలో ఇవి రెండే ముఖ్యమైనవి.ఈ రెండు మ్యాచ్‌లలో మెరిసిన ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా.. లేటెస్ట్‌‌గా బెంగళూరుతో మ్యాచ్‌లో 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 19పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాక.. బౌలింగ్‌లో పడిక్కల్ వికెట్ తీసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. ఇక అంతటితో ఆగకుండా బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ(43)ని పెవిలియన్ పంపించాడు. బంతి దాదాపు సిక్స్‌ వెళ్లింది. అయితే స్టన్నింగ్ క్యాచ్ పట్టేశాడు తెవాటియా. వాస్తవానికి ఇదే మ్యాచ్‌లో కీలక మలుపు.. కోహ్లీ వికెట్ పడిపోయాక దాదాపు మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే డివిలియర్స్ మెరుపులు కారణంగా రాజస్థాన్ చివరిలో మ్యాచ్ ఓడిపోయింది.ఈ క్రమంలోనే స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న రాహుల్ తెవాటియాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగలడంటూ తన మార్క్ మాటలతో పొగిడేశాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కోహ్లీ భారీ షాట్ కొట్టగా.. దానిని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. ఆ వెంటనే సమన్వయం కోల్పోతున్నట్లు గ్రహించి బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి చాకచక్యంగా అందుకున్నాడు.ఈ క్యాచ్‌కు ఫిదా అయిన సెహ్వాగ్.. ఈ సీజన్‌లో అతను పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ రాహుల్ తెవాటియాను పొగుడుతూ ట్వీట్ చేశాడు. ‘తెవాటియా ఏదైనా చెయగలడు. ఆఖరికి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయగలడు. అద్భుతమైన క్యాచ్’అంటూ సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు.

Related Posts