కరోనాకు చెక్ పెట్టే ప్రొటీన్ కనిపెట్టిన 14 ఏళ్ల NRI అమ్మాయి, అనిక చేబ్రోలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

NRI girl Anika Chebrolu: అమెరికా… టెక్సాస్ లోని ఫ్రిస్కోలో నివసిస్తున్న తెలుగమ్మాయి 14 ఏళ్ల అనికా చేబ్రోలు కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడే శక్తిమంతమైన థెరపీని ఆమె కనిపెట్టింది. ఈ ఆవిష్కరణకు గానీ అనికా 2020 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ గెలిచి…రూ.18 లక్షలకు పైగా ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇందుకోసం ఆమె ఇన్-సిలికో మెథడ్ ఉపయోగించింది. ఇండిపెండెన్స్ హైస్కూల్ చదువుతున్న అనికా కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే కొవ్వును కట్టడి చేసే ప్రధాన మాలిక్యూల్ ను అనికా కనిపెట్టింది.తాను అభివృద్ధి చేసిన ఈ అణువు సార్స్ కరోనా వైరస్ పై ఒక నిర్దిష్ట ప్రోటీన్ ను నిలువరిస్తుందని అనిక చేబ్రోలు తెలిపింది. ఈ ప్రొటీన్ను బంధించడం ద్వారా ఇది వైరస్ ప్రోటీన్ పనితీరును ఆపివేస్తుందని దీన్ని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్ తో ప్రారంభించానని తెలిపింది అనికా. కరోనా రోజులు పోయి… సాధారణ రోజులు రావాలని..ప్రజలు స్వేచ్చగా ఎటువంటి భయం లేకుండా సాధారణ రోజులు గడపాలనుకోరుకుంటున్నానని అనికా మీడియాకు తెలిపింది.కొద్ది నెలల కిందట ఈ పోటీలో అనికా తొలుత స్వైన్ ఫ్లూపై తన ప్రాజెక్టును రూపొందించుకోగా ఆపై కరోనాపై పనిచేయాలని నిర్ణయం తీసుకున్న్ అనికా దాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడటంతో తన ప్రాజెక్టు కరోనా పై పరిశోధనను చేయాలనుకున్నానని అనిక తెలిపింది. తాను స్కూల్ ఎడ్యుకేషణ్ పూర్తి అయ్యాక వైద్య పరిశోధకురాలిగా కెరీర్ ను ఎంచుకుంటానని.. కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తాత ప్రోత్సాహంతో తనకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని తెలుగమ్మాయి అనికా చేబ్రోలు తెలిపింది.కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా వ్యాపించగా..11లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 2.19లక్షల మంది చనిపోయారు. టెక్సాస్ లో 8th class చదువుతున్న ఇండియన్ సంతతికి చెందిన అనికా సాధించిన ఈ ప్రాజెక్టును మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ దానిలో ఉండే విశిష్టతను ఇప్పుడు అందరూ గుర్తించారు.నిజానికి అనికా అంత తేలిగ్గా తన ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇందుకోసం ఆమె రకరకాల వైరస్ లు, వ్యాధులను అధ్యయనం చేసింది. ఏయే వ్యాధులపై, ఏ మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంది. తన టీచర్ల సహాయంతోను.. కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తాత ప్రోత్సాహంతోను..కరోనా మహమ్మారి అంతు చూడాలంటే… ఎలాంటి పరిశోధన చేయాలో తెలుసుకుంది. ఆ దిశగా ప్రయత్నించింది. శ్రమించింది. చివరకు విజయం సాధించింది.అనికా సాధించిన ప్రైజ్ మనీ ఛాలెంజ్ కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ మాట్లాడుతూ..అనికా చాలా చురుకైన అమ్మాయి. ఈ వయస్సులోనే సమాజం పట్ల చాలా శ్రద్ధ కలిగిన అమ్మాయి. కరోనా వ్యాక్సిన్ పై ఎన్నో ప్రశ్నలు వేస్తూ..చివరకు తన విజయాన్ని సాధించిందని తెలిపారు.ఇప్పుడు ఆమె పరిశోధన వల్ల ఈ ప్రపంచానికి మేలు కలగనుంది అని ప్రశంసించారు.


ఈ పరిశోధనతో అనికా టాప్ యంగ్ సైంటిస్ట్ గుర్తింపు పొందింది. కానీ ఆమె లక్ష్యం అంతటితో ఆగిపోదు.. ఇంకా ఏవో చేయాలని తపన పడుతోంది. మనిషిని చావు నుంచి కాపాడే అంశంపై ప్రపంచ సైంటిస్టులతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని అనికా తెలిపింది.నేను వేసవిలో కనిపెట్టినది… ప్రపంచ పరిశోధనలతో పోల్చితే… సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే..ఇంకా కష్టపడి పనిచేయాలి..నేను కనిపెట్టిన మాలిక్యూల్… కరోనా వైరస్ ని ఎలా చంపుతుందో… ఎలా డ్రగ్ తయారవుతుందో ప్రపంచ సైంటిస్టులతో కలిసి… పనిచేయాల్సి ఉంది ” అని ఈ 14ఏళ్ల మేథావి చెబుతోంది.

Related Tags :

Related Posts :