మహేష్ ఛాలెంజ్ స్వీకరించిన విజయ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజున సూపర్‌స్టార్ మహేష్ బాబు మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన దళపతి విజయ్ చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

విజయ్ మొక్కలు నాటే ఫోటోలు పోస్ట్ చేస్తూ, ‘‘మహేష్ గారు ఇది మీ కోసం, అందరి ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం’’ అంటూ ట్వీట్ చేయగా మహేష్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ‘‘థ్యాంక్స్ బ్రదర్’’ అంటూ విజయ్‌కి రిప్లై ఇచ్చారు.

ఈ సందర్బంగా దళపతి విజయ్ మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖలందరు భాగస్వామ్యులవుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఒక మనిషికి సరిపడా ఆక్సిజన్ అందించే  మొక్కలు చాలా తక్కువ. వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు, అందువల్ల దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడంలో అశ్రద్ధ చూపుతున్నాం అనడానికి నిదర్శనం.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు, మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం, ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం, మొక్కలు నాటడం పైన, పర్యావరణ పరిరక్షణపైన మంచి అవగాహన కల్పించడం అభినందనీయం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది’.. అన్నారు.

Related Posts