అభిమాని చెప్పులు తాకిన విజయ్: వీడియో వైరల్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vijay pick up fan slipper: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం(సెప్టెంబర్ 26)న ఆయనకు అత్యంత ఇష్టంగా గడిపే తామరైపాక్కం ఫామ్‌హౌస్‌లో జరిగాయి. అయితే బాలు అంత్యక్రియలకు తమిళస్టార్ హీరో దళపతి విజయ్ హాజరయ్యారు. ఆయన తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని చెప్పు జారిపోవడంతో విజయ్ చేతితో చెప్పుతీసి అందించారు.


ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరైన విజయ్‌ తిరిగి వెళుతుండగా అతన్ని కలవడానికి అభిమానులు గుమిగూడారు. అది చూసి పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. ఆ సందర్భంలో ఓ అభిమాని తన చెప్పులను అక్కడే జారవిడుచుకుని వెళ్లిపోయాడు. విజయ్‌ను పోలీసులు తీసుకెళుతున్న క్రమంలో పోలీసులు వారిస్తున్నప్పటికీ విజయ్‌ ఆ అభిమాని చెప్పును తీసి అందించారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ అగ్ర హీరో ఇలా రియాక్ట్‌ కావడం చూసిన వారు సదరు హీరో రియల్‌ లైఫ్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటుంటే, విజయ్‌ అభిమానులు మాత్రం మా దళపతి బంగారం అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

Related Posts