లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

వరుసగా నాలుగోసారి రికార్డ్ క్రియేట్ చేసిన దళపతి..

Published

on

Master

Master: ‘దళపతి’ విజయ్ కథానాయకుడిగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన కోలీవుడ్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. మాళవికా మోహనన్ కథానాయిక. కార్తి ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో XB Film Creators నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్నింగ్ షో నుండే హిట్ టాక్‌తో, హైయ్యెస్ట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది. తాజాగా ‘మాస్టర్’ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్), తర్వాత రూ. 200 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన విజయ్ నాలుగో చిత్రమిది.

MASTER
జనవరి 13 న విడుదలైన ‘మాస్టర్’ పదిరోజుల్లోపే, అందులోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో తమిళ్, తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముఖ్యంగా దళపతి విజయ్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.