విజయ్ VS విజయ్ సేతుపతి.. టీజర్ అదిరిందిగా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vijay’s Master – Teaser: దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. మాళవికా మోహనన్ కథానాయిక. ఇటీవల కార్తి ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో XB Film Creators నిర్మిస్తోంది.


ఇటీవల విడుదల చేసిన పోస్టర్లకు రెస్పాన్స్ బాగుంది. దీపావళి సందర్భంగా ‘మాస్టర్’ టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. విజయ్ తన మార్క్ స్టైల్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయాడు. ఇక విజయ్ సేతుపతి ఎప్పటిలానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు.


సత్యన్ సూర్యన్ విజువల్స్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. విజయ్, విజయ్ సేతుపతి అభిమానులకు అసలైన దివాళీ ట్రీట్ ఈ టీజర్ అని చెప్పాలి. ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ‘మాస్టర్’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

Related Tags :

Related Posts :