లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగా ఛాన్స్.. ‘లూసిఫర్’ కి థమన్ మ్యూజిక్..

Published

on

Thaman S: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152 వ సినిమా ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు బాస్ 153 వ సినిమాగా మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కనుంది. ఎన్‌ఆర్‌వి సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Chiranjeevi

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.మోహన్ రాజా (జయం రాజా) ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటివి చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌ని సెలెక్ట్ చేశారు.

Thaman

అన్నయ్య చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రావడంతో నా కల నిజమైంది.. తెలుగు ‘లూసిఫర్’ కి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాను అంటూ థమన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనవరి 21 న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.