అమెరికా లవ్స్‌ ఇండియా Trump Tweet

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

అమెరికా 244వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటోంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ..ట్వీట్ చేశారు. అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు.. స్వేచ్ఛ, మానవ సమానత్వాన్ని ఆచరిస్తూ జరుపుకునేదే స్వాతంత్య్ర దినోత్సవం. అంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్యూ మై ఫ్రెండ్‌. అమెరికా లవ్స్‌ ఇండియా. భారత్‌ను అమెరికా ఎల్లప్పుడు ప్రేమిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాకు 1776 జులై 02వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కాంటినెంటల్ కాంగ్రెస్..బ్రిటన్ కింగ్ జార్జ్ కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 04వ తేదీన అధికారికంగా ప్రకటన చేశారు. శ్వేతసౌధంలో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి. అప్పటి దేశాధ్యక్షుడు థామస్ జఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు. మొదట్లో అమెరికాకు స్వాతంత్ర దినోత్సవం సందర్భగా సెలవు ఉండేది కాదు. 1870లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం రోజున సెలవు ప్రకటించింది. ఆ తర్వాత..1941 నుంచి వేతనంతో కూడిన సెలవుగా మార్చారు.

 

Related Posts