లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

గవాస్కర్‌కు అనుష్క చివాట్లు.. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని తెలీదా..?

Published

on

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. అందులో డైరక్ట్ గా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నే టార్గెట్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కామెంటేటింగ్‌లో గవాస్కర్ అనుష్క శర్మ గురించి ప్రస్తావించడమే దీనికి కారణం.

విరాట్ కోహ్లీ మైదానంలో ఉండగా.. అనుష్కను రిఫరెన్స్ గా చేసుకుని సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు. కోహ్లీ ఫ్యాన్స్ కు కూడా గవాస్కర్ మాటలు నచ్చలేదు. దానికి నిరసనగానే బీసీసీఐ.. కామెంటరీ ప్యానెల్ నుంచి గవాస్కర్ ను తొలగించాలంటూ ట్విట్టర్ లో కామెంట్లు చేశారు. కోహ్లీ పర్‌ఫార్మెన్స్ బాగున్నా.. బాగుండకపోయినా ప్రతిసారీ అనుష్క శర్మను లాగుతుండటంపై ఈ సారి ఘాటుగానే స్పందించారు.‘మిస్టర్ గవాస్కర్ నీ మెసేజ్ అసహ్యంగా అనిపిస్తుంది. భర్త ఆడుతున్న గేమ్ గురించి భార్యపై ఆరోపణలు ఎలా చేస్తారు. ఇన్నేళ్లుగా గేమ్ గురించి కామెంటరీ చేస్తున్నారు. అందరి వ్యక్తిగతంగా గౌరవిస్తూనే ఉన్నారు. అదే స్థాయిలో నా మీదా.. మా మీద ఎందుకు చూపించాలని అనుకోవడం లేదా.

గురువారం మ్యాచ్ లో నా భర్త ఆటతీరు గురించి మాట్లాడానికి మీ మనసులో ఎన్నో పదాలు ఉంటాయని తెలుసు. ఇది 2020 నా విషయంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు. నాపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఎప్పుడు వదిలేస్తారు. గౌరవనీయమైన మిస్టర్ గవాస్కర్, మీరు ఓ లెజెండ్‌.

క్రికెట్‌లో ఎంతో పేరు సంపాదించారు. కేవలం మీ మాటలు విన్నప్పుడు నాకెంత బాధ వేసిందనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అని ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *