లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భిన్నత్వంలో ఏకత్వం మా సిద్ధాంతం

Published

on

The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తున్నామని అన్నారు.

కోవిడ్ నివారణకు కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది తమ సిద్ధాంతం అన్నారు. ప్రజల మధ్య శాంతిని చెడగొట్టేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, గవర్నర్, మంత్రులు, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఎగరవేశారు. శాసనమండలి వద్ద జాతీయజెండాను ఛైర్మన్ షరీఫ్ ఆవిష్కరించారు. సచివాలయం వద్ద జెండాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఎగరవేశారు.