మా రాజధాని.. మా ఇష్టం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్ష అధికారం పూర్తిగా రాష్ట్రాలదే పేర్కొంది. రాజధాని రాష్ట్రానికి సంబంధించిదా? రాష్ట్రానికి సంబంధించిందా? ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎవరు ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించిన అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసింది.

మూడు రాజధానులకు సంబంధించిన కేసు సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంట్లో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధానికి సంబంధించిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే అని ఇటీవల కేంద్రం తన అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపర్చింది.

రాజధాని సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట రద్దు ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంతృప్తిగా ఉన్నట్టుగానే భావించాలని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అంతేకాకండా కేంద్రంతో జరిగే ప్రతి సమావేశంలో కూడా హోదా గురించి తాము అడుగుతూనే ఉన్నాం..వదిలి పెట్టలేదని తెలిపింది. ప్రత్యేక హోదా కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్క్రత అంశంగానే పరిగణించాల్సివుంటుందని హైకోర్టుకు స్పష్టం చేసింది.

రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పార్లమెంట్ లో చెప్పింది. ఇటీవల హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.

అయితే దీనికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఎవైతే నిర్మాణాలున్నాయో.. ఆ నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారంతోపాటు రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు కాబట్టి..తాము రాజధాని కోసమే భూములిచ్చాం..వేరే అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదని చెప్పి రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారో..దానికి సంబంధించి పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు చేస్తున్నారో వాటన్నింటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. వీటంన్నింటిని పరిశీలించి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

READ  బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి టీడీపీ ఎంపీ అవంతి 

Related Posts