గుండె నొప్పి అంటూ క్లినిక్‌లకు పరుగులు పెట్టిస్తున్న Apple Watch

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

heart మానిటరింగ్ ఫీచర్ ఉన్న Apple Watch పదుల సంఖ్యలో ఫేక్ గుండెనొప్పితో హాస్పిటల్ కు పరిగెత్తేలా చేస్తుంది. వారి వాచ్‌లలో పల్స్ రేట్ అనుమానస్పదంగా కనిపిస్తుండటంతో 10శాతం మంది మాయో క్లినిక్ కు వెళ్లి కార్డియాక్ కండిషన్ గురించి పరీక్షలు చేయించుకుంటున్నారు. హెల్త్ మానిటరింగ్ డివైజెస్ తో హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్కువగా వాడేస్తున్నారు. దీంతో అవసరానికి మించి వాడుతున్నారని.. మాయో క్లినిక్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈమెయిల్ లో వెల్లడించారు.

దీంతో ఎక్కువ ఖర్చు పెట్టించడమే కాకుండా.. డాక్టర్, పేషెంట్ టైం అవసరానికి మించి వాడుకునేలా చేస్తుంది. అరిజొనా, ఫ్లోరిడా, విస్కోన్సిన్, లోవా లాంటి ప్రతి మాయో క్లినిక్ సైట్ లో హెల్త్ రికార్డులు స్కాన్ చేయడంతో ఆపిల్ వాచ్ పొరబాట్లు బయటపడుతున్నాయి. డిసెంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019వరకూ ఆరు నెలల కాలంలో ఆపిల్ వాచ్ పర్‌ఫార్మెన్స్ ను గమనించారు.ఆపిల్ అసాధారణ గుండె కదలికలను గమనిస్తుందంటూ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్టడీ ఇలా పనిచేసింది. 264 మంది పేషెంట్ల రికార్డుల పరిగణనలోకి తీసుకుని గుండె కదలికలని గమనించారు. వారిలో కేవలం 41మంది మాత్రమే కరెక్ట్ గా చూపించగా మిగిలిన వారి రిపోర్టులు తప్పుగానే కనిపిస్తున్నాయి. కార్డియాక్ డయాగ్నోసిస్ లో సగం మంది పేషెంట్లకు ఆల్రెడీ సమస్య ఉన్నట్లుగా గుర్తించారు.

30పేషెంట్లు డాక్టర్లను కలిసిన తర్వాత కార్డియాక్ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. హార్ట్ మానిటర్ డేటాలో చాలా వరకూ తప్పులు కనిపిస్తున్నాయి. పేషెంట్ ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆపిల్ వాచ్ చూపిస్తున్న రికార్డులు సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అనవసరంగా హెల్త్ కేర్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఒత్తిడి, కంగారు పెరిగేలా చేస్తున్నాయి. వచ్చిన వారి అనుమానం ఆపిల్ వాచ్ నుంచే అయితే అది తెలిసిన డాక్టర్లు కూడా విసుక్కుంటున్నారు.ఈ అలర్ట్ ను యూజర్లు నెగ్లెక్ట్ చేయలేరు. పల్స్ రేట్ అనుమానంగా కనిపిస్తుండటంతో మెడికల్ కండిషన్ తెలుసుకోవడానికి క్లినిక్ లకు వెళ్తున్నారు. అని కిర్క్ వ్యాట్ అన్నారు.

Related Tags :

Related Posts :