రెప్పపాటులో బతికిపోయింది : తల్లిని పెను ప్రమాదం నుండి కాపాడిన బాలుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ ఘటన అక్కడున్న వాళ్లందరినీ షాక్ గురి చేసింది.

ఓ తల్లి స్విమ్మింగ్ పూల్ పక్క ఉన్న చెట్టు కింద రిలాక్స్ అయి చదువుతూ కూర్చుతుంది. ఇద్దరి చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఆడుకుంటున్నారు. ఆమె కొడుకు ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టాడు. కంగారు పడ్డ ఆమె అక్కడి నుంచి లేచి మరోవైపు పరుగెత్తింది. అంతలోనే ఒక పెద్ద చెట్టుకు ఉన్న కొమ్మ పెద్ద శబ్ధం చేస్తూ తాను కూర్చున్న ప్లేస్ లో పడిపోయింది. అనుకోకుండా జరిగిన ఘటనలో పిల్లలతోపాటు తల్లి కూడా గట్టి కేకలు వేసింది.

ఆ మహిళ కూర్చున్న కుర్చీ నుజ్జు నుజ్జు అయిపోయింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో ఆమె షాక్ కు గురైంది. ఏం జరిగిందో అర్థం కాక చెట్టువైపే చూస్తూ నిలబడి పోయింది. ఆ ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తల్లిని రెప్పపాటు వ్యవధిలో కాపాడిన ఆ బాలున్ని అందరూ మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Posts