లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..కానీ…చంపేశాడు

Published

on

boyfriend who killed his girlfriend : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ..చంపేశాడు. దీనికి కారణం..పెద్దల మాటతో తనకు దూరమైందనే కసితో యువకుడు దారుణానికి తెగబడ్డాడు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పెనుమూరు మండలం తూర్పుపల్లె ప్రాంతానికి చెందిన గాయత్రి (20) పెనుమూరులో డిగ్రీ చదువుతోంది. పూతలపట్టు మండలం చింతమాకుల పల్లెకు చెందిన ఢిల్లీ బాబు కూడా అక్కడే డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నాడు. పెనుమూరు మార్గంలోనే వీరిద్దరూ వచ్చేవారు.

దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించి..గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయారు. తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె తప్పిపోయిందంటూ..గాయత్రి తండ్రి షణ్ముగరెడ్డి పెనుమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ గుర్తించి..కౌన్సెలింగ్ చేశారు. అనంతరం తల్లిదండ్రులతో గాయత్రి వెళ్లిపోయింది. దీంతో ఢిల్లీ బాబు కక్ష పెట్టుకున్నాడు.

ఇంటి సరుకుల కోసం బంధువుల అమ్మాయితో కలిసి..మంగళవారం ద్విచక్ర వాహనంపై పెనుమూరుకు వచ్చింది. ఈ విషయం ఢిల్లీ బాబు తెలుసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఎంప్రాళ్లకొత్తూరు మీదుగా వస్తున్న సమయంలో..గాయత్రిని ఢిల్లీ బాబు అడ్డుకున్నాడు. మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఢిల్లీ బాబు..తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచాడు. అది విరిగిపోవడంతో..మరో కత్తితో విచక్షణారహితంగా కడుపులో 10 సార్లు పొడిచాడు. అడ్డు వస్తే..చంపేస్తానని గాయత్రి బంధువును బెదిరించాడు. తీవ్ర రక్తస్రావంతో గాయత్రి కుప్పకూలిపోయింది. అదే సమయంలో అటువైపుగా ఓ వ్యక్తి రావడంతో..ఢిల్లీ బాబు బైక్ పై పరారయ్యాడు. బాధితురాలిని తొలుత పెనుమూరు పీహెచ్ సీకి తర్వాత..వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయత్రి మరణవార్త తెలుసుకున్న బంధువులు..చింతమాకులపల్లెకు వెళ్లి నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి, పాకాల సీఐలు పరిస్థితిని సమీక్షించారు. హత్య, దాడి ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.