సెల్ ఫోన్ డేటా వాడినందుకు తమ్ముడిని చంపిన అన్న

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

brother killed younger brother : రోజురోజుకూ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి. మొబైల్ ఫోనే లోకంగా గడిపే నేటి యువత అందులో డేటా లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. డాటా కోసం తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులతో గొడవలకు దిగుతున్నారు. రాజస్థాన్ లో దారుణం జరిగింది. మొబైల్ డేటా అయిపోగొట్టాడని తమ్ముడిని అన్న హత్య చేశాడు.జోధపూర్ కు చెందిన రామన్, రాయ్ అన్నదమ్ములు. గత బుధవారం తమ్ముడు రాయ్..అన్న రామన్ కు తెలియకుండా ఆయన మొబైల్ డాటాను పూర్తిగా వాడుకున్నాడు. దీంతో రామన్ తమ్ముడితో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వివాదం పెద్దదైంది. రాయ్ ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన రామన్.. కత్తితో తమ్ముడి ఛాతిలో నాలుగైదుసార్లు బలంగా పొడిచాడు.దీంతో రాయ్ రక్తం కక్కుకోవడంతో రామన్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాయ్ ను చూసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రామన్ కోసం గాలిస్తున్నారు.

Related Tags :

Related Posts :