రాఖీ పండుగ ముందు రోజు..TikTok సింగర్ రాజు ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

TikTok ఎంతో మందిని స్టార్స్ ను చేసేసింది. ఎంతోమందిని ఫాలోవర్స్ ను సంపాదించి పెట్టింది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేటకు చెందిన యంగ్ మేన్ గడ్డం రాజు మంచి పేరు సంపాదించాడు. కానీ..ఈయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాఖీ పండుగ ముందు రోజు ఈ విషాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.‘అక్క రాఖీతో ఇంటికి వస్తే..లేడు..ఇక రాడని చెప్పమ్మ’…అనే పాట ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో చాలా మంది ఇతడిని ఫాలో చేశారు. కానీ ఆ పాట పాడిన వ్యక్తి..2020, జులై 02వ తేదీ శనివారం జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ తెలియరావడం లేదు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యుు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts