శాసన రాజధానిగా అమరావతి… ఆ ప్రాంత ప్రజలేమంటున్నారు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించడం పట్ల వైజాగ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటుగా రాజధాని వికేంద్రీకరణ బిల్లును కూడా ఆమోదం తెలిపారు.

గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత మూడు రాజధానుల వ్యవహారం వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు చెప్పిన ప్రకారం ఇప్పట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. సచివాలయానికి కావాల్సిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ ప్రస్తుతం విశాఖలో లేవు కాబట్టి ప్రణాళికబద్ధంగా బిల్డింగ్స్ నిర్మాణం జరిగిన తర్వాతే తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అమరావతి సచివాలయ ఉద్యోగుల సంఘం చెబుతుంది.

అంతేకాకుండా గతంలో ఇప్పుడున్న సచివాలయాన్ని ఆరు నెలల్లో నిర్మించారు. అంతే సమయంలో విశాఖలో సచివాలయం నిర్మించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిర్మించిన తర్వాతే అమరావతిలో ఉన్న సచివాలయాన్ని అక్కడకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి తాము ప్రభుత్వానికి వినతుల చేశామని చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొంత మంది ఉద్యోగులు విజయవాడుకు వెళ్లారో వారికి కుటుంబాలతో గడిపే వెసులుబాటు ఉండటం, కుటుంబం అక్కడ, ఉద్యోగం ఇక్కడ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది.

ఉన్నపలంగా సచివాలయాన్ని విశాఖకు తీసుకెళ్తే ఇబ్బందులకు గురవుతామని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు సచివాలయాన్ని వైజాగ్ తీసుకెళ్లే పరిస్థితి లేదని కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చాలా మంది ఎంప్లాయిస్ పిల్లలు చదువుకుంటున్న పరిస్థితి ఉంది.

వైజాగ్, విజయవాడ పోయిరావడం, వీక్లీ వన్స్ రావడం కష్టంగా ఉంటాయి. కుటుంబానికి కూడా అవసరాలు ఉంటాయి. కాబట్టి విద్యాసంవత్సరం వ్యవహారంలో కూడా సందిగ్థ పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని చెబుతోంది. సెప్టెంబర్ ప్రారంభం అవుతుందా లేదా అన్న విషయం కూడా కొంత సందిగ్థావస్థలో ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ను దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచివాలయానికి కావాల్సిన విస్తర్ణంతో ఉన్న భవనాలు మాత్రం విశాఖలో లేవని చెప్పొచ్చు.

దానికి సంబంధించిన భవనాల నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాతే తీసుకెళ్లే అవకాశముంటుందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాకుండా కోర్టుకు సంబంధించిన వ్యవహారం కూడా దీనిలో కలిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. అన్ని కేసులు సంబంధించి ఒకటిగానే పరిగణించి కోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉంది.

READ  నిబంధనలు పట్టించుకోని మహారాష్ట్ర ఎమ్మెల్యే...బర్త్ డే వేడుకలు

అమరావతి పరిరక్షణ సభ్యులు..
‘రాజధాని వికేంద్రీకరణ బిల్లు పాస్ చేయడమంటే ప్రపంచంలో ఇంతకన్నా దుర్మార్గమైన చర్య. ప్రజలను మోసం చేసే చర్య ఎక్కడైనా ఉంటుందా. భారతదేశంలో ఏ ఒక్కరైతు అయినా ఒక్క సెంట్ భూమి ప్రభుత్వాలకు ఇస్తారా ఇది రైతులను హత్య చేయడమే అవుతుంది. భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము రైతులకు అండగా ఉంటాం.. ఏమీ కావాలని చేస్తామని ఎన్నో ఉపన్యాసాలు చెప్పి ఇప్పుడు ప్రజలను మోసం చేశాయి’ అని మండిపడుతున్నారు.

Related Posts