లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

ఈ బ్లాక్ హోల్‌కి ఆకలెక్కువ… సింగిల్ డేలో సూర్యుడిని మింగేస్తోంది!

Published

on

విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. బ్లాక్ హోల్ (కాల రంధ్రం)తో ఎప్పటికైనా ముప్పు తప్పదనే మాట ఎన్నో యేళ్లుగా వినిపిస్తోనే ఉంది. ఇప్పుడు ఆ బ్లాక్ హోల్‌ విషయంలో సైంటిస్టులు నమ్మలేని నిజాన్ని బయటపెట్టారు. విశ్వంలో అతిపెద్ద బ్లాక్ హోల్‌లో ఒకటి మాత్రం రోజురోజుకి భారీ పరిమాణంలో పెరిగిపోతుందని గుర్తించారు. అంతేకాదు.. దాని ద్రవ్యరాశి పరిమాణాన్ని కూడా కొలిచారు. ప్రత్యేకమైన బ్లాక్ హోల్ మొత్తం విశ్వంలో వేగంగా పెరుగుతున్న బ్లాక్ హోల్ గా చెబుతున్నారు. ప్రతిరోజూ సూర్యుడితో సమానమైన ద్రవ్యరాశిని మింగేస్తుందని అంటున్నారు. అల్ట్రా-భారీ బ్లాక్ హోల్ SMSS J215728.21–360215.1 లేదా కేవలం J2157 గా పిలుస్తుంటారు సైంటిస్టులు. ఇటీవలి అధ్యయనం J2157 2018లో కనుగొన్న ఘాతాంక రేటుతో ఈ బ్లాక్ హోల్ భారీగా పెరిగిందని తెలిపింది.

J2157 అంటే ఏమిటి? :
J2157 బ్లాక్ హోల్.. ఒక క్వాసార్‌ (quasar)కు శక్తినిస్తుంది. యాక్టివ్ గెలాక్సీ కేంద్రకం కూడా. చాలా ప్రకాశవంతమైనది. భారీ బ్లాక్ హోల్ కలిగి ఉందని గుర్తించారు. ప్రారంభ విశ్వంలో బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ మధ్యలో దీన్ని గుర్తించినట్టు సైంటిస్టులు పేర్కొన్నారు. భూమి నుంచి 12.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అల్ట్రామాసివ్ బ్లాక్ హోల్… భారీ ద్రవ్యరాశిని పరిశీలిస్తే సూర్యుని కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుందని అంటున్నారు. సైన్స్-న్యూస్ నివేదికలో చెప్పినట్లుగా.. J2157 బ్లాక్ హోల్ మన పాలపుంత (మిల్కీ) గెలాక్సీ మధ్యలో ఉంది.. ఈ బ్లాక్ హోల్.. పౌర్ణమి కంటే 10 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

అధ్యయనం ఏమి చెబుతోంది? :
నెలవారీ నోటీసులలో Royal Astronomical Society ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. quasar J215 బ్లాక్ హోల్ (BH) ద్రవ్యరాశి (3.4 ± 0.6) × 1010 M⊙ (బ్లాక్ హోల్ ద్రవ్యరాశి) రెడ్ షిఫ్ట్ z = 4.692గా ఉందని గుర్తించారు. ఈ కొలతలు J2157 చాలా పెద్ద పరిమాణంగా తేల్చారు. అంతేకాదు.. వృద్ధి రేటును సూచిస్తాయని తెలిపారు. అధ్యయనం దీనిని z> 4 వద్ద అత్యంత భారీ BHలలో ఒకటిగా పేర్కొంది. J2157 మింగివేసే సగం సౌర ద్రవ్యరాశిని చుట్టూ ఒక రోజులో దాదాపు 20 బిల్లియన్ల సూర్య ద్రవ్యరాశి రికార్డ్ ద్రవ్యరాశిగా ఉందని సైంటిస్టులు అంచనా వేశారు.

సవరించిన సంఖ్యలు ద్రవ్యరాశి సుమారు 34 బిలియన్ సౌర ద్రవ్యరాశిగా ఉండాలని నివేదికలు సూచిస్తున్నాయి. రోజుకు ఒక సూర్యుని ద్రవ్యరాశిని మింగేయలగలదని సూచిస్తున్నాయి. బ్లాక్ హోల్ ద్రవ్యరాశి పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ కంటే 8,000 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త Christopher Onken తేల్చారు. పాలపుంత బ్లాక్ హోల్ ఇలానే పెరిగిపోతుంటే.. మన గెలాక్సీలోని నక్షత్రాలలో మూడింట రెండు వంతులు మింగేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

Read:హాంకాంగ్‌ ఫైనాన్స్ హబ్‌పై డ్రాగన్ దెబ్బ.. ముంబైకి కలిసొస్తుందా?

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *