లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Published

on

hearing on bhuma Akhilapriya’s bail petition adjourned : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ తరుపు లాయర్స్ సెషన్స్‌ కోర్టును కోరారు. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదే కేసులో ఇవాళ మరో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే అఖిలప్రియను కస్టడి విచారణలో అనేక విషయాలు రాబట్టిన పోలీసులు.. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఇద్దరు నిందితులు మల్లిఖార్జున్ రెడ్డి, సంపత్‌లను బోయిన్‌పల్లి పోలీసులు విచారించనున్నారు. విచారణ అనంతరం పోలీసులు వీరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.