ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికనే ప్రైవేట్ ఆస్పత్రులు అమలు చేయాలని తెలిపింది. కోవిడ్-19 పేరుతో విచ్చవిలవిడిగా డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్ లను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

అంతకముందు కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది.

దీంతో ఇప్పటివరకు 50 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని సీఎస్ సోమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. అయితే వాటిలో కొన్ని హాస్పిటల్స్ లెసెన్స్ లు మాత్రమే రద్దు చేశారని మిగతా ప్రైవేట్ ఆస్పత్రుల సంగతేంటని నిలదీసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎస్ ను ప్రశ్నించింది.

ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయో ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఆక్సిజన్ బెడ్స్ లేక పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని…ఆసిఫాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, వరంగల్ లోని కోవిడ్ సెంటర్లలో చాలా మంది చనిపోయారని కోర్టు మండిపడింది. అలాగే హితం యాప్ పై అవగాహన ఎలా కల్పిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. మారుమూల గ్రామాల్లో హితం యాప్ ఊసే లేదంటూ నిలదీసింది.

ఇక హైకోర్టు ప్రశ్నలకు సీఎస్ సమాధానాలు ఇచ్చారు. కరోనా కట్టడి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 86 కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐసీఎమ్మార్, డబ్ల్యుహెచ్ వో గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో రోజు 40 వేల టెస్టులు చేస్తున్నామని కోర్టుకు సీఎస్ తెలిపారు.

ఇక హితం యాప్ ను కేంద్ర బృందమే ప్రశంసించిందన్నారు. ఎమర్జెన్సీ కోసం 30,295 బెడ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు 16 హాస్పిటల్స్ పై చర్యలకు సిద్ధమైనట్లు కోర్టుకు తెలిపారు.

READ  కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా

Related Posts