ఎట్టకేలకు ఆండ్రాయిడ్‌లో 64-bit Chrome వెర్షన్ వస్తోంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ నుంచి సరికొత్త క్రోమ్ (Chrome) వెర్షన్ రిలీజ్ కాబోతోంది. ఎప్పటినుంచో అదిగో అంటూ ఊరిస్తున్న గూగుల్ క్రోమ్ 64-bit వెర్షన్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ యాప్‌లో 64bit డివైజ్ వెర్షన్ అందుబాటులో లేదు. కొన్ని సెక్యూరిటీ ఇష్యూలు, పర్ఫార్మెన్స్ ఇష్యూలు ఎక్కువగా ఉండేవి. ఈ కొత్త వెర్షన్ రిలీజ్ కావడంతో ఆండ్రాయిడ్ యూజర్లకు మరింత సెక్యూర్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి అప్ డేట్‌ను Android Police రివీల్ చేసింది.

Chorme Dev, Chrome Canary (85, 86 వెర్షన్)లలో chrome://version ఈ రెండు అప్ డేట్స్ బహిర్గతమయ్యాయి. ప్రస్తుత వెర్షన్ క్రోమ్ 32-bit మాత్రమే కనిపిస్తోంది. 64-bit వెర్షన్ లోకి అప్ గ్రేడ్ కావడంతోనే సరికొత్ ఆండ్రాయిడ్ క్రోమ్ బ్రౌజర్ గా వినియోగదారులకు కనిపించనుంది. ఆండ్రాయిడ్ 10 లేదా ఆపై ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే ఆండ్రాయిడ్ డివైజ్‌ లో మాత్రమే 64-bit క్రోమ్ బ్రౌజర్ యాక్సస్ చేసుకోవచ్చు. పాత డివైజ్ ల్లో మాత్రం ఆండ్రాయిడ్ 10 ఇన్ స్టాల్ చేయలేరు.

వీటిలో కేవలం పాపులర్ వెబ్ బ్రౌజర్ 32-bit వెర్షన్ మాత్రమే యాక్సస్ చేసుకోవచ్చు. గూగుల్ కొత్త రూల్స్ ప్రకారం.. ఆగస్టు 1, 2021 నాటికి అన్ని యాప్స్ తప్పనిసరిగా 64-bit వెర్షన్ కు అప్ డేట్ అయి ఉండాలి. ఆండ్రాయిడ్ 10 మాత్రమే ఇన్ స్టాల్ చేసిన యూజర్లంతా తమ డివైజ్‌లో క్రోమ్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 84 వెర్షన్ యాప్‌లలో కొంతమంది యూజర్లకు 64-bit వెర్షన్ గూగుల్ క్రోమ్ కనిపిస్తుందని అంటున్నారు.

మరికొంతమంది మాత్రం అదే 84 వెర్షన్ లోనూ 32-bit వెర్షన్ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే ఇన్ స్టాల్ అయినట్టుగా చూపిస్తుందని చెబుతున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే.. chrome://version అని అడ్రస్ బార్ లో ఎంటర్ చేస్తే.. దీనికి సంబంధించి సెక్షన్ లేబుల్ క్రోమ్ టాప్ లో కనిపిస్తుంది. Chrome Dev, Chrome Canary వెబ్ బ్రౌజర్లు రెండూ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఆగస్టులో క్రోమ్ 85 వెర్షన్ లోనూ క్రోమ్ బ్రౌజర్ 64-bit వెర్షన్ అందుబాటులోకి రావచ్చు.

Related Posts