కసాయి తల్లి, ప్రియుడి మోజులో చిన్న కొడుకు హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

The mother who murdered : ప్రియుడి మోజులో కొడుకునే కడతేర్చిందో కసాయి తల్లి. ప్లాన్‌ బెడిసి కొట్టి అడ్డంగా బుక్కైంది. ప్రియుడితో కలిసి కొడుకులకు చిత్రహింసలు పెట్టిందా ఆ తల్లి. చిన్న కొడుకును హత్య చేసి..మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బాలుడు కన్పించకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగి..ఉషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో చోటు చేసుకుంది.జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో కోటేశ్వరరావు దంపతులు నివసిస్తున్నారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో కోటేశ్వరరావు భార్య ఉష వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు చాలా సార్లు ఉషను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా.. లాభం లేకపోయింది.. రోజూ ఇద్దరి మధ్య గొడవ జరిగేది.ఇక చేసేదేమీ లేక ఉషను పుట్టింటికి పంపించి వాళ్ల తల్లిదండ్రులను తీసుకురమ్మన్నాడు. అయితే పుట్టింటికి వెళ్లిన ఉష.. తన ప్రియుడు వద్దే ఉంటోంది. ఇది తెలుసుకున్న కోటేశ్వరరావు ఆమెను ఇంటికి రావొద్దని తేల్చి చెప్పాడు. ప్రియుడితో ఉంటున్న ఆ లేడి..తన ఇద్దరు కొడుకులు అడ్డుగా ఉంటున్నారని భావించింది. కన్న కొడుకులన్న విషయం మరిచి…ఆ ఇద్దర్నీ అంతం చేయాలనుకుంది. ప్రియుడు శ్రీనుతో కలిసి చిన్న కొడుకుని అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడలో మృతదేహాన్ని పూడ్చి పెట్టి ఇంటికి వెళ్లారు.బాలుడు రెండు రోజులుగా కన్పించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఉషాని అడగ్గా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు…ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి చంపినట్లు ఒప్పుకోవడంతో ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. అన్యాయంగా తన బిడ్డను పొట్టన పెట్టుకున్న వారికి కఠిన శిక్ష వేయాలని ఉష భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related Tags :

Related Posts :