మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య : ఆరేళ్ల చిన్నారిని గొంతుకోసి చంపిన దుండగుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు ఓ దుర్మార్గుడు. చిన్నారిని కరుణాకర్ అనే నిందుతుడు చంపినట్టు తెలుస్తోంది. అభం శుభం తెలియని చిన్నారి గొంతు కోసి నిందితుడు అతి కిరాతకంగా చంపడం స్థానికంగా కలకలం రేపింది.

భువనగిరికి చెందిన అనూష, కళ్యాణ్ గత కొంతకాలంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో నివాసముంటున్నారు. వీరికి ఆద్య అనే ఆరేళ్ల పాప ఉంది. అయితే అనూషతో కరుణాకర్ అనే యువకుడు చనువుగా ఉన్నాడు. కొంతకాలంగా అనూష దూరం పెట్టడంతో కరుణాకర్ కసి పెంచుకున్నాడు. ఉదయం ఇంట్లో ఉన్న అనూష కూతురు ఆద్యను కరుణాకర్ హత్య చేశాడు. అనంతం పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది? ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు. ఇంతటి నీచానికి దిగజారిన అతనిపై చర్యలు తీసుకోవాలని, అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న కరుణాకర్ ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. తను యాదాద్రి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. అయితే బాలికను హత్య చేసిన అనంతరం అతను నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. చిన్నారిని హత్య చేయడాని కంటే ముందు ఇంటి దగ్గర ఏం జరిగిందన్న విషయం తెలియాల్సివుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కరుణాకర్ కు సంబంధించిన విభేదాలు కానీ, ఆర్థికపరమైన గొడవల గానీ ఏవిధమైన తగాదలు లేవని ప్రాథమిక సమచారం. కానీ ఎందుకు హత్య వరకు వెళ్లిందన్న విషయంపై క్లారిటీ రావాల్సివుంది. దీనిపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుడు కరుణాకర్..
‘ఎంత మంచిగా చూసుకున్నానో నాకు తెలుసు. అన్ని క్లియర్ గా చెప్తా. ఫస్టు వాళ్ల మమ్మీ అనురావుతో పరిచయం ఏర్పడింది. బజాజ్ ఫిన్ సర్వ్ లో పని చేశాను. ఏఎస్ రావు నగర్ లో యాప్ ఈఎంఐలో మొబైల్ తీసుకోవడానికి వచ్చింది. తర్వాత కొన్ని రోజులు వస్తూ ఉండేది. మొదట్లో కస్టమర్ గానే ట్రీట్ చేశాను’ అని వివరించారు.

READ  కరోనా కలకలం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన యువకుడి అజాగ్రత్త

Read:దుష్టశక్తులు పారదోలతానని, వివాహితపై అత్యాచారం

Related Posts