కొత్త ‘టిక్‌టాక్’ స్కామ్.. TikTok Pro పేరుతో ఇలా మెసేజ్‌ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనా షార్ట్ వీడియో షేరింగ్ టిక్ టాక్ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో చైనీస్‌కి చెందిన 58 ఇతర ప్రముఖ యాప్స్‌తో పాటు పాపులర్ టిక్ టాక్ యాప్ ను కూడా నిషేధం విధించింది. ఇప్పుడు ఆ టిక్ టాక్ పేరుతో మరో కొత్త టిక్ టాక్ అంటూ మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్‌లో TikTok Pro అని ఉంది. భారతదేశంలో టిక్‌టాక్ ప్రో రూపంలో అందుబాటులో ఉందంటూ ఇలాంటి మెసేజ్ వస్తే ఎవరూ నమ్మొద్దు.

వాట్సాప్ లేదా SMS ద్వారా మీకు మెసేజ్ వస్తే దాన్ని వెంటనే డిలీట్ చేయండి. అధికారిక టిక్‌టాక్ యాప్ భారతదేశంలో బ్లాక్ చేసిన తర్వాత కూడా సైబర్‌ క్రైమినల్స్ SMS ద్వారా టిక్‌టాక్ ప్రో అనే మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేస్తున్నారు. టిక్‌టాక్ వీడియోను ఆస్వాదించండి. క్రియేటీవీతో కూడిన వీడియోలను మరోసారి క్రియేట్ చేయండి. ఇప్పుడు టిక్‌టాక్ (TikTok Pro)లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆపై కింద లింక్ నుంచి టిక్ టాక్ ప్రో యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. టిక్‌టాక్ ప్రో APK ఫైల్‌ను డౌన్‌లోడ్ లింక్ కూడా సోషల్ ప్లాట్ ఫాంల్లో వైరల్ అవుతోంది.

ఒకవేళ.. నిజంగా ఇది టిక్ టాక్ యాప్ అనుకుని ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తే మాత్రం ఐకాన్ ఒరిజినల్ టిక్‌టాక్ యాప్ మాదిరిగానే కనిపిస్తుంది. మీ ఫోన్ డివైజ్ లోని కెమెరా, ఇమేజ్ గ్యాలరీ, మైక్ వంటి అనుమతులను (Allow) యాక్సస్ అడుగుతుంది. మీరు ఒకవేళ అనుమతిస్తే.. టిక్ టాక్ యాప్ వర్క్ చేయదు. కానీ, మీ ఫోన్‌లోనే ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. దీని అప్ డేట్స్ కూడా రావు.

మీరు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలాంటి యాప్స్ సోషల్ మీడియా అకౌంట్లలో యూజర్ ఐడిలను హ్యాక్ చేస్తాయి. విలువైన ప్రైవసీ డేటాను తస్కరిస్తాయి. ఈ యాప్స్ ఫేస్‌బుక్‌ను యూజర్ల డేటాను కూడా తస్కరించాయని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ Evina గూగుల్‌ను హెచ్చరించింది. ఇటీవల, కనీసం 25 ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.

The New TikTok Scam that you must know

యూజర్ల లాగిన్ వివరాలతో పాటు ఈ 25 యాప్స్ మొత్తం 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయి. ఎక్కువగా ఫైల్ మేనేజర్లు, ఫ్లాష్‌లైట్, వాల్‌ పేపర్ నిర్వహణ, స్క్రీన్‌షాట్ ఎడిటర్, వెదర్ వంటి సేవలను అందిస్తున్నాయి. ఈ యాప్స్ మాల్వేర్‌తో వచ్చాయి. మీ ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను మీ ఫోన్‌లో ఉపయోగించినప్పుడు రికార్డ్ చేస్తుంది. టిక్ టాక్ సర్వీసుల మాదిరిగా APK ఫైళ్లను లేదా ఇటీవల మారువేషంలో మాల్వేర్ కావచ్చు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన ఇతర యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరిస్తోంది.

READ  పేద‌ల‌కు పంచిన పిండి ప్యాకెట్లలో రూ.15 వేలు, ఇది ఆ స్టార్ హీరో పనేనా

Related Posts