లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

USB-C కనెక్ట్ చేస్తే.. ఈ Pixel 5 ఫోన్ ఆటోమాటిక్‌గా వైర్‌లెస్ ఛార్జ‌ర్‌గా మారిపోతుంది!

Published

on

Pixel 5 wireless charging pad : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే ఫిక్సల్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఒకటి యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. అదే.. రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్.. దీన్ని గూగుల్ ప్రత్యేకించి ఫిక్సల్ ఫోన్లలో తీసుకొచ్చింది.

మీ ఫిక్సల్ 5 ఫోన్‌‌కు USB-C కేబుల్ ప్లగ్ కనెక్ట్ చేయగానే అది ఆటోమాటిక్‌గా రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ గా మారిపోతుంది. Qi ఛార్జింగ్ ప్యాడ్ మాదిరిగా మారుతుంది.ఫిక్సల్ 5 ఫోన్లలో బ్యాటరీ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. మరో Qi ఆధారిత డివైజ్ ను మీ ఫోన్ డిటెక్ట్ చేయగానే బ్యాటరీ షేర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎప్పటిలానే అది ఛార్జింగ్ అవుతుంది.


iPhoneలో కొత్త ఫీచర్.. కళ్లు లేనివారికి దారిచూపిస్తుంది.. సామాజిక దూరాన్ని సూచిస్తుంది!


లేదంటే.. ఆటోమాటిక్ గా బ్యాటరీ షేర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. మీ ఫోన్‌కు USB-C ప్లగ్ కనెక్ట్ చేయకుండా రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ వినియోగించుకోలేరు. అప్పుడు బ్యాటరీ షేర్ ఆప్షన్ మాన్యువల్ గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బ్యాటరీ ఛార్జర్ దగ్గర లేని సమయంలో మాత్రమే ఉపయోగ పడుతుంది.ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలంటే.. ముందుగా Pixel 5 ఫోన్లలో Settings బటన్ పై క్లిక్ చేయండి. Battery ఆప్షన్ ఎంచుకోండి. Settingsపై క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. అక్కడ బ్యాటరీ షేర్ లేదా బ్యాటరీ షేర్‌పై Toggle చేయండి.ప్రత్యేకించి ఆటోమాటెడ్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్ ఎడిషన్ ఉంటుంది.  పూర్తి స్థాయిలో Qi ఛార్జర్ మాదిరిగా మారిన Pixel 5 ఫోన్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *