ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే నంబర్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఒకే నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇకపై ఎవరైనా 77189 55555 నంబర్‌కు కాల్‌, ఎస్‌ఎంఎస్‌ చేసి ఎప్పుడైనా సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆదివారం (నవంబర్ 1, 2020) నుంచి ఈ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రాంతాల వారీగా రీఫిల్‌ బుక్‌ చేసుకునేందుకు వేర్వేరు ఫోన్‌ నంబర్లు ఉండేవని అన్నారు.పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు జరుపవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు https://cx.indianoil.in వెబ్‌సైట్‌లో చూడొచ్చన్నారు.

Related Tags :

Related Posts :