స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ బాబు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్ బాబు కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాద ఘటనలో రమేష్ బాబు, ఆస్పత్రి నిర్లక్ష్యం ఉందని విచారణ కమిటీలు తేల్చింది.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో ఇప్పటికే పది మంది చనిపోయారు. దీని కోసం ప్రత్యేకంగా ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిన్నటి నుంచి పూర్తిగా రమేష్ బాబు ఆస్పత్రి గానీ, స్వర్ణ ప్యాలెస్ కు సంబంధించి తనిఖీలు నిర్వహించారు.

ఇప్పటికే రమేష బాబు ఆస్పత్రికి సంబంధించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ మచిలీపట్నంలోని జిల్లా సబ్ జైలుకు తరలించారు. దీనికి సబంధించి పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత రమేష్ బాబు పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుస్తోంది. రమేష్ బాబును అరెస్టు చేసేందుకు ఇవాళ అతని ఇంటికి వెళ్లిన సందర్భంలో రమేష్ బాబు అక్కడ లేకపోవడంతో పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు.రమేష్ బాబు పరారీలో ఉన్నాడు.. రమేష్ బాబు కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. రమేష్ బాబు ఎక్కడున్నా సరే లొంగిపోవాలని పోలీసులు మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు.దీంతో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. కోవిడ్ కు సంబంధించి అగ్రిమెంట్ హోటల్ యాజమానితోపాటు రమేష్ బాబు హాస్పిటల్ సిబ్బందితో ఒప్పందం చేసుకున్నారు. లూపోల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లూపోల్స్ ప్రకారమే రమేష్ బాబుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

రమేష్ బాబు ఇల్లు, స్వర్ణ ప్యాలెస్ కు సంబంధించి నిన్న ఎనిమిది ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. హాస్పిటల్ కు సబంధించి సీడీలు, హార్డ్ డిస్కులతో వివిధ కీలకమైన పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఖంగా వాటిపై చర్చించి న్యాయ సలహాలు తీసుకుని రమేష్ బాబును అరెస్టు చేసేందుకు వెళ్తే అతను పరారైనట్లు పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు.రమేష్ బాబు ఎక్కడున్నా లొంగిపోవాలంటూ లేకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. తప్పించుకుని తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని..లొంగిపోయి ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు చెప్పాలన్నారు.

Related Posts