సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి యువకుడు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో పడిపోయాడు. సెల్ఫీ తీసుకుంటుండగా సెల్ ఫోన్ జారీ పోయింది. దానికోసం వెళ్లే క్రమంలో జారి నీటి వలయంలో పడిపోయాడు.

రూరల్ మండలం ఖండాల జలపాతం దగ్గర మరో జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గరకు ఇంద్రవెళ్లికి సంబంధించిన ఐదుగురు అబ్బాయిలు నిన్న విహారయాత్రకు వెళ్లారు. 19 సంవత్సరాల అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా జారడంతో జలపాతంలో పడి చనిపోయినట్లుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ దొరక లేదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అతని డెడ్ బాడీ లభించింది.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జలపాతాల వద్ద ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 15 రోజుల క్రితం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన జలపాతాల దగ్గర మూడు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మాత్రం కచ్చితంగా ఇలాంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.

Related Posts