లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

ఆర్టీసీ సమ్మె విరమణ

Published

on

There is no strike of TS RTC workers  JAC Ashwathama Reddy Press Meet

తెలంగాణ రాష్ట్ర వాసులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావావలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ సమ్మె విరమణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా..సర్కార్ స్పందించలేదు. డిపోలకు వచ్చిన కార్మికులను అధికారులు తిప్పి పంపిస్తున్నారు.

ప్రైవేటు కార్మికుల విధుల నుంచి వెళ్లిపోవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సూచించారు. 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పనిపరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. ఇధి కార్మికుల నైతిక విజయమన్నారు. 

అమరుల కుటుంబాలను జేఏసీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. తాము తీసుకున్న నిర్ణయానికి ఆర్టీసీ కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీని రక్షించుకోవడానికి తాము ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా..స్పందించినా..విధులకు హాజరు కావాలని కార్మికులకు సూచిస్తున్నట్లు వెల్లడించారు. విధుల్లో చేరి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 
Read More : మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *