లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!..

Published

on

Without Any Filmy Background: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే బ్యాగ్రౌండ్ ఉండాల్సినవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు అని కొంత మంది అప్ కమింగ్ యాక్టర్స్ నిరూపిస్తున్నారు. తాము చేసిన ఒకటి రెండు సినిమాలతోనే ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ సాధిస్తున్నారు. వారి Performance తో కట్టిపడేస్తున్నారు. ఈమధ్య కాలంలో సినీ వర్గాల వారిని, ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రాళ్లు ఎవరో చూద్దాం..

Suhasనిన్న మొన్నటి వరకూ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న సుహాస్ ఇప్పుడు హీరోగా మారాడు. ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుహాస్..తన ఇన్నోస్సెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యాక్టింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో సుహాస్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. త్వరలో ‘కలర్ ఫోటో’ అనే మూవీతో హీరోగా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Thiruveerథియేటర్ నుంచి యాక్టర్‌గా ఎదిగిన నటుడు తిరువీర్. ఎటువంటి సపోర్ట్ లేకుండా తన యాక్టింగ్ స్కిల్స్‌తో..మంచి Performance తో ఆకట్టుకుంటున్నాడు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు తిరువీర్. ‘బొమ్మల రామారం’లో మల్లేష్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అయ్యి ‘ఘాజీ’, ‘మల్లేశం’, ‘శుభలేఖ+లు’, ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలలో లీడ్ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘జార్జ్‌రెడ్డి’ లో లాలాసింగ్ పాత్ర, ‘పలాస’ లో రంగారావు క్యారెక్టర్ తిరువీర్ కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ‘సిన్’, ‘మెట్రో కథలు’ వంటి వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు తిరువీర్.

George Reddyఎటువంటి సపోర్ట్ లేకుండా..చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యి.. హీరోగా సక్సెస్ సాధిస్తున్నాడు సందీప్ మాధవ్. ‘దళం’, ‘లోఫర్’, ‘జ్యోతిలక్ష్మీ’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన సందీప్ మాధవ్.. రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ తో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేసి మెప్పించాడు సందీప్. ఇక ఆ తరువాత ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్‌లో జార్జ్ రెడ్డి క్యారెక్టర్ అదరగొట్టాడు. జార్జ్ రెడ్డిగా సందీప్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.Viswantవీళ్లే కాదు.. ‘పలాస’ సినిమాతో హీరోగా పరిచయం అయిన రక్షిత్ కూడా తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇక వీరితో పాటు ‘కేరింత’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి. అటు హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ సాధిస్తున్న విశ్వాంత్ కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన Performance తో ఆకట్టుకుంటున్నాడు.Palasa

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *