ఈ 5 ఉద్యోగాలు చేస్తే.. నెలకు లక్షల్లో జీతం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

5 highest-paying jobs in India : ఎలాంటి ఉద్యోగాలు చేస్తే.. నెలకు లక్షల్లో జీతం సంపాదించవచ్చు? ఏయే రంగాల్లో నెలవారీగా అత్యధికంగా జీతాన్ని చెల్లిస్తున్నాయి. ఏయే నగరాల్లో హై శాలరీ చెల్లించే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో తెలుసా? ఇలాంటి ఉద్యోగాల్లో చేరిన వారు నెలకు లక్షల్లో సంపాదన పొందొచ్చు.గత ఆగస్టు 2020లో Randstad Insights Salary Trend Report 2019 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశంలో అత్యధిక జీతాలను చెల్లించే ఉద్యోగాలు ఉన్న నగరంగా బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పూణె నగరాలు ఉన్నాయి. ఇంతకీ ఈ నగరాల్లో హైయస్ట్ పేయింగ్ జాబ్స్ ఎందులో ఉన్నాయో తెలుసా? కొన్ని లీడింగ్ జాబ్ పోర్టల్స్ ఆధారంగా భారతదేశంలో అత్యధిక జీతాన్ని చెల్లించే ఈ 5 ఉద్యోగాల్లో ఏడాదికి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు జీతాన్ని పొందవచ్చు. ఈ కింది జాబితాలో ఏదైనా ఉద్యోగానికి మీ జాబ్ ప్రొఫైల్ మ్యాచ్ అయినా లేదా ఆసక్తి ఉంటే ఓసారి ప్రయత్నించి చూడండి.1. Investment Banker
భారతదేశ జాబ్ మార్కెట్లో Investment Banker మరో బూమింగ్ కెరీర్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఫైనాన్స్ అసెట్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ అర్థం చేసుకోగలగాలి.. స్టాక్స్, సెక్యూరిటీస్ వంటి అంశాల్లో పట్టు ఉండాలి. అలాగే అనుభవం, అవగాహనతో పాటు స్కిల్స్ కూడా తప్పనిసరి.

ఎవరూ అప్లయ్ చేయొచ్చు :
బ్యాచిలర్ డిగ్రీలో కామర్స్, ఫైనాన్స్ లేదా ఎకనామిక్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతం :
Monster జాబ్ పోర్టల్ ప్రకారం.. ప్రెషర్… ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా జాయిన్ అయ్యే ఉద్యోగులకు ఏడాదికి 12 లక్షల వరకు సంపాదించవచ్చు. మిడ్ లెవల్, అనుభవం కలిగిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ఉద్యోగులు వార్షిక వేతనం 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది.2. Medical Professionals :
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. Monster జాబ్ పోర్టల్ ప్రకారం.. భారతదేశంలో అత్యధిక జీతాన్ని చెల్లించే ఉద్యోగాల్లో ఇదొకటి.

ఇందులో వివిధ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. Dentistry, Cardiology, Obstetrics and Gynaecology, Oncology, Nursing, Pharmacy, Healthcare Administrator వంటి స్పెషలైజేషన్‌‌లో ఏదొ ఒకటి ఎంచుకోవచ్చు.

ఎవరూ అప్లయ్ చేయొచ్చుంటే? :
NEET పరీక్ష వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పూర్తి చేసినవారితో పాటు M.B.B.S డిగ్రీ కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతం :
ఒక ప్రెషర్‌గా.. ఈ స్పెషలైజేషన్‌లో చేరిన వారికి ఒక ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల జీతాన్ని సంపాదించవచ్చు. అదే ఉద్యోగ అనుభవం ఎక్కువగా ఉంటే మాత్రం ఏఢాదికి 17 లక్షల జీతాన్ని పొందవచ్చు.3. Chartered Accountant
దేశంలో Chartered Accountant (CA) ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ట్యాక్స్ మేనేజ్ మెంట్ వ్యవహారాలను మానేజ్ చేస్తుంటారు.

బ్యాంకింగ్ సొల్యుషన్స్ అంశాలపై ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా హెల్ప్ చేస్తుంటారు. ఇండియాలో అత్యధిక వేతనం చెల్లించే ఉద్యోగాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు.

ఎవరూ అప్లయ్ చేయొచ్చుంటే? :
కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసినవారితో పాటు ఆర్ట్స్, సైన్స్ లో డిగ్రీ చేసినా విద్యార్థులు ఈ ఉద్యోగానికి అర్హత పొందవచ్చు.Shine జాబ్ పోర్టల్ ప్రకారం.. Institute of Chartered Accountant of India (ICAI)లో సర్టిఫై మెంబర్ అయి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే ముందుగా వారి ఫౌండేషన్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతం :
ఫ్రెషర్.. గా ఏడాదికి 7 లక్షల వరకు వేతనంగా పొందవచ్చు. అదే అనుభవం ఉన్న సీఏలు అయితే ఏడాదికి 20 లక్షల నుంచి 24 లక్షల వరకు వేతనాన్ని పొందవచ్చు.

4. Data Scientist :
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారిని ఎక్కువగా ఆకర్షించే ఐటీ రంగాల్లో ఇదొకటి.. Data Scientist.. ముఖ్యంగా ఫ్రెషర్లు తమ కెరీర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం పలు ఐటీ కంపెనీల్లో డేటా సైంటిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఐటీ, టెలికం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్ సహా పలు కంపెనీల్లో డేటా సైంటిస్టులను భారీ వేతానాలు ఇచ్చి మరి తీసుకుంటున్నారు.

ముంబై, బెంగళూరు నగరాల్లో డేటా సైంటిస్టు ఉద్యోగాలకు హై శాలరీ ఇస్తున్నారు. ఒక డేటా సైంటిస్టు యావరేజ్ శాలరీ ఏడాదికి 14 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది.ఇండియాలో లీడింగ్‌లో ఉన్న పలు టెక్ కంపెనీల్లో IBM, Accenture, Tata Consultancy Services డేటా సైంటిస్టుల కోసం ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి.

ఎవరూ అప్లయ్ చేయొచ్చు :
IT, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ తో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఈ డేటా సైంటిస్టు ఉద్యోగానికి అర్హులే.. డేటా సైన్స్ కోర్సులో మాస్టర్ డిగ్రీ చేసిన విద్యార్థులు కూడా అర్హులే.ఈ కోర్సును IIT delhi, IIT Kharagpur and IIM Calcutta విద్యా సంస్థలు డేటా సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

వేతనం :
upGrad జాబ్ పోర్టల్ ప్రకారం.. డేటా సైంటిస్టు స్టార్టింగ్ శాలరీ సగటున 9.5 లక్షల నుంచి ఉంటుంది. 5 ఏళ్ల అనుభవం ఉన్న డేటా సైంటిస్టులకు ఏడాదికి 60 లక్షల వరకు వేతనాన్ని పొందవచ్చు.

5. Blockchain Developer :
భారత జాబ్ మార్కెట్లో బ్లాక్ చెయిన్ డెవలపర్లకు ఇప్పుడెప్పుడే డిమాండ్ పెరుగుతోంది. నెమ్మదిగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది. టెక్ ఉద్యోగాలపై ఎక్కువగా ఆసక్తి ఉన్నవారికి ఈ టెక్నాలజీ ద్వారా మరెన్నో ఉద్యోగవకాశాలను కల్పించనుంది.

వాస్తవానికి.. కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ అందించే కోర్సులో కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఒకటిగా ఉంది.బ్లాక్ చెయిన్ డెవలపర్ కు అవసరమైన స్కిల్.. nitty-gritties, డిజైన్, డెవలప్, బ్లాక్ చెయిన్ అప్లికేషన్లు, టెక్నాలజీపై టెస్టింగ్ చేయడం అవగాహన ఉండి ఉండాలి.

ఎవరూ అప్లయ్ చేయొచ్చుంటే? :
ఇంజినీరింగ్, ఐటీ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విద్యార్థులు ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చు.

సౌండ్ నాల్డెజ్ కోడింగ్, మ్యాథ్ మ్యాటిక్స్, అల్గారిథమ్స్, ప్రొగ్రామింగ్ ల్వాంగేజీల్లో C++, Java, Python వంటివి కూడా తెలిసి ఉండాలి.వేతనం :
upGrad ప్రకారం.. ఇండియాలో బ్లాక్ చెయిన్ డెవలపర్ శాలరీ అనుభవంతో సగటున ఏడాదికి 8 లక్షల వరకు ఉంటుంది.. అనుభవం పెరిగితే కొద్ది ఏడాదికి 45 లక్షల వరకు పెరుగుతు పోవచ్చు.

గమనిక : ఈ హైయస్ట్ పేయింగ్ జాబ్స్ గణాంకాలు సగటుగా లెక్కించివి మాత్రమే. ఈ ఉద్యోగాల్లో జీతాలు ఒక్కో కంపెనీలో ఒక్కోలా ఉండొచ్చు. మీ నైపుణ్యాలు, ఉద్యోగ అనుభవం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

Related Tags :

Related Posts :