లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మన హీరోలు.. ‘గుండు బాస్’ లు..

Published

on

కథ, పాత్ర, ప్రాంతానికి తగ్గట్టు హీరోలు తమ గెటప్, డైలాగ్ మాడ్యులేషన్ వంటివి మార్చుకుంటూ ఉంటారు. యాస, భాషలతో పాటు వేషధారణ కూడా మార్చుకోక తప్పదు. సీమ బ్యాక్ డ్రాప్ అయితే మీసాలు మెలెయ్యడం, ఒంటిపై ఖద్దరు వెయ్యడం, రఫ్ క్యారెక్టర్ అయితే ఒత్తైన జుట్టు, గెడ్డంతో కనిపించడం ఇలాంటివి చాలా చూశాం. అయితే పాత్రకు తగ్గట్టు గుండుతో (నిజమైన) కనిపించింది మాత్రం చాలా తక్కువ మంది హీరోలే..


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. చిరు తర్వాతి సినిమాలో గుండుతో కనిపిస్తారనుకున్నారంతా.. కట్ చేస్తే ఇది సరదాగా ట్రై చేశాను.. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూశారా అంటూ చిరు ఇదంతా ఉత్తుత్తి గుండే అని కన్ఫమ్ చేశారు.

Chiranjeevi

ఈ సందర్భంగా తెరమీద గుండుతో కనిపించిన హీరోలెవరో ఓసారి చూద్దాం..
సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘శివాజి’ సినిమా క్లైమాక్స్ లో రజినీ గుండుతో కనిపించి ఆకట్టుకున్నారు.

Rajinikanth


నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు, వివిధ గెటప్స్ వేశారు. అయితే తొలిసారి ఆయన తెరమీద గుండుతో కనిపించనున్నారు. (ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో కాసేపు గుండుతో కనిపించినా అది ఒరిజినల్ కాదు) ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయిన బాలయ్య ఈ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. ఇప్పటికే ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. బయట అయితే బాలయ్య గుండుతో కనిపించారు కానీ సినిమాలో గెటప్ ఎలా ఉంటుంది అనేది మాత్రం రివీల్ చేయలేదు.

Balakrishna


కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఆయన తొలిసారి ముసలి గెటప్ వేసుకున్నారు. వైట్ విగ్గుతో నాగ్ లుక్ బాగుంది. బిగ్ బాస్ వర్కింగ్ స్టిల్స్ లో నాగ్ తల చూపించకపోయేసరికి గుండుతో కనిపిస్తారేమోనని అనుకున్నారు కానీ నాగ్ ఓల్డ్ గెటప్ లో కనిపించి
సర్ ప్రైజ్ చేశారు.


‘శేషు’ చిత్రంలో యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ గుండుతో కనిపించి ఆకట్టుకున్నారు. తమిళ్ లో విక్రమ్ నటించగా బ్లాక్ బస్టర్ అయిన ‘సేతు’ చిత్రానికి తెలుగు రీమేక్ ‘శేషు’.. గెటప్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకున్నారు రాజశేఖర్.

Kalyan Ram


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరీర్లో తొలిసారి గుండుతో కనిపించిన చిత్రం ‘శివశంకర్’.. ఈ చిత్రంలో కొద్దిసేపు గుండుతో కనిపిస్తారు మోహన్ బాబు. సౌందర్య నటించిన చివరి చిత్రం ఇది. అలాగే ‘గజిని’ మూవీలో సూర్య, ‘కాష్మోరా’ చిత్రంలో కార్తి గుండుతో కనిపించి అలరించారు.


‘ఓం 3డి’ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కొద్దిసేపు గుండుతో కనిపిస్తారు. అలాగే సీనియర్ నటుడు ఆనంద్ రాజ్, క్యారెక్టర్ నటులు గుండు సుదర్శన్, మెట్టు రాజేంద్రన్, అజయ్ ఘోష్ తదితరులు చాలా వరకు గుండుతోనే కనిపించి ఆకట్టుకుంటున్నారు. అలాగే యువ హీరోలు సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నిఖిల్ వంటి వారు పర్సనల్‌గా గుండుతో కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.Karthi

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *