These Tollywood Directors to get Another Chances

మాకూ సినిమాలొస్తున్నాయోచ్.. బిజీ అవుతున్న టాలీవుడ్ డైరెక్టర్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వరుస సినిమాలతో సందడి చేయనున్నతెలుగు యువ దర్శకులు..

అప్పుడెప్పుడో హిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లాపులతో పలకరించారు.. ఇంకేముంది ఇండస్ట్రీ గురించి తెలిసిందేగా.. హిట్ ఇచ్చినప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నవాళ్లు.. ఫ్లాప్ ఇచ్చినప్పుడు కనీసం కాంపౌండ్ దగ్గరకు కూడా రానివ్వరు. అలా ఈ మధ్య కనిపించకుండా పోయిన శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్, పరశురామ్ లాంటి డైరెక్టర్లు మళ్లీ మాకు సినిమాలు దొరకుతున్నాయోచ్.. అని ఎగిరి గంతేస్తున్నారు. 

సక్సెస్ ఇస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పట్టించుకునేది. ఒక్క ఫ్లాప్ వచ్చి పడిందా.. పక్కనపెట్టేస్తారు. అలా ఒకప్పుడు హిట్లు ఇచ్చి తర్వాత ఫ్లాపులతో ఇబ్బంది పడి.. సినిమాలు లేక ఖాళీగా ఉండి అవకాశాల కోసంవెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు మళ్లీ హమ్మయ్యా.. సినిమాలొస్తున్నాయి అని ఆనందపడిపోతున్నారు.

శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్, మహేష్ లాంటి స్టార్లతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి హిట్ సినిమా చేసి కూడా 2016లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అసలు అడ్రస్ లేకుండా పోయాడు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత వెంకటేష్‌తో ‘అసురన్’ తమిళ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు.. వరుణ్ తేజ్‌తో మరో సినిమా కూడా రెడీగా ఉంది. 

మిగతా డైరెక్టర్లలాగా ఫ్లాప్ ఇచ్చి ఇబ్బంది పడలేదు పరశురామ్. ‘గీతగోవిందం’ లాంటి రూ.100 కోట్ల సినిమా చేసి కూడా ఛాన్స్ లేక ఖాళీగా ఉన్నాడు. 2018లో వచ్చిన ‘గీతగోవిందం’ తర్వాత రెండేళ్లకు నాగచైతన్య చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్‌లో కూడా మరో సినిమా చెయ్యబోతున్నానని తెగ ఆనందపడిపోతున్నాడు పరశురామ్. 

‘బొమ్మరిల్లు’ సినిమానే తన ఇంటి పేరుగా చేసుకున్న భాస్కర్.. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా పేరు తెచ్చుకోలేదు. 2013లో వచ్చిన ‘ఒంగోలు గిత్త’ తర్వాత అసలు తెలుగులో అడ్రస్ లేకుండాపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్ట్స్ దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమా డిపెండ్ అయ్యి ఉంటుంది.

రాహుల్ సంకృత్యాన్.. విజయ్ దేవరకొండతో గీతాఆర్ట్స్‌లో  చేసిన ‘టాక్సీవాలా’ సినిమా మంచి హిట్ అయ్యింది. కొత్త స్టోరీతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో వచ్చింది. ఈ సినిమా హిట్ అయినా.. డైరెక్టర్‌కి మాత్రం మరో అవకాశం రాలేదు. ఇన్నాళ్లకు నాని సూపర్ డూపర్ చాన్స్ ఇచ్చాడు. సాయిపల్లవి, నాని కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాతో రాహుల్ బిజీ అవుతున్నాడు. 

READ  ‘అరే, ఒరే’ అని పిలుచుకునేంత స్నేహం.. రాజాతో బాలు గొడవకు కారణమేంటో తెలుసా?

‘గబ్బర్ సింగ్’ హిట్‌తో ఇండస్ట్రీలో మంచి టాక్ తెచ్చుకున్న హరీష్ శంకర్ తర్వాత వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’, ‘డిజె’ లాంటి సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మళ్లీ చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి  సినిమా హిట్ కొట్టిన హరీష్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్-మైత్రి మూవీస్ కాంబినేషన్‌లో చేయబోయే సినిమాతో పాటు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో మరో సినిమా కూడా చేస్తున్నాడు హరీష్ శంకర్. 

Read More>>ఫ్లిప్ కార్ట్‌లో మొబైల్ బొనాంజ: భారీ ఆఫర్లు ఉన్న ఫోన్లు ఇవే

Related Posts