Home » కాంగ్రెస్ కు తెలిసింది ఇటాలియన్ సంస్కృతి మాత్రమే…అమిత్ షా
Published
1 year agoon
By
subhnకేంద్ర మంత్రి అమిత్ షా శస్త్ర (ఆయుధ) పూజలపై వస్తున్న కౌంటర్లను తిప్పికొట్టారు. దసరా పండుగ రోజున రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత ప్రభుత్వం అందుకుంది. ఎయిర్ఫోర్స్ డే రోజును పురస్కరించుకుని ఫ్రాన్స్ లో తయారైన విమానం భారత్ కు చేరింది. తొలి యుద్ధ విమానం కావడంతో దానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేసి ఒక మతపు సంస్కృతిని దేశానికి ఎలా ఆపాదిస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై ఎన్నికల ప్రచారంలో లొహారులో ఉన్న అమిత్ షా స్పందించారు.
అక్టోబరు 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఉన్న ఆయన గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇది తమాషాగా ఉందని వాళ్లకు భారత సంస్కృతి తెలియదని కేవలం ఇటాలియన్ సంస్కృతి మాత్రమే తెలుసని విమర్శించారు. ఇది కాంగ్రెస్ తప్పు కాదని ఆ కుటుంబానిదేనని అన్నారు. బీజేపీ ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కలిసి చీడపురుగుల్లా దేశాన్ని తినేస్తున్నాయని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమ వలసదారులను ఒక్కరిని కూడా ఉండకుండా దేశం నుంచి వెల్లగొడతామని మాట ఇచ్చారు.