వారిద్దరూ ప్రేమలో ఉన్నారు…20ఏళ్ళ నాటి అత్యాచారం కేసులో సుప్రీం కీలక తీర్పు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

20-Year-Old Rape Case-Top Court Acquits Man 1999నాటి అత్యాచార కేసులో నిందితుడిని ఇవాళ(సెప్టెంబర్-29,2020)సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి… బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారని,. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాభేదాలు వచ్చాయని.. ఈ నేపథ్యంలో తనను కాదని మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో బాధితురాలు అత్యాచార ఆరోపణలు చేసిందని కోర్టు తెలిపింది. అందుకనే కేసుపై పునరాలోచన చేసి తాజా తీర్పునిచ్చినట్లు పేర్కొంది.


అంతకుముందు ఇదే కేసులో ట్రయల్ కోర్టు, జార్ఖండ్ హైకోర్టు నిందితుడిని దోషిగా తీర్పు నివ్వడంతో.. అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. 1999లో కేసు నమోదు చేసేటప్పుడు బాధిత మహిళకు 20 ఏళ్లు కాదని 25 సంవత్సరాలు అని కింది కోర్టుల తీర్పులను ఉంటకిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించింది. అంటే 1995లో మహిళపై దాడి జరిగిన సమయంలో ఆమె మేజర్‌ అని తెలిపింది.

ఇద్దరు రాసుకున్న లేఖలతోపాటు వారు దిగిన ఫోటోలను చూడటం ద్వారా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు అర్థం అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులకు గురైన అనంతరం ఏ స్త్రీ కూడా నిందితుడికి ప్రేమ లేఖలు రాయదని, అతనితో నాలుగేళ్లపాటు సహజీవనం చేయదని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు తనను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడని అందుకే తను చాలా కాలం అతనితో ఉండిపోయానని బాధితురాలు పేర్కొంది.


సాక్ష్యాధారాల్ని పరిశీలించగా.. బాధితురాల్ని పెళ్లి చేసుకునేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడని, వారి పెళ్లికి ఇరువురు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు సుప్రీం కోర్టు తెలిపింది. కానీ బాధితురాలు క్రిస్టియన్‌ కాగా నిందితుడు షెడ్యూల్డ్ తెగకు చెందినవాడని వెల్లడించింది. వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి వివాహానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరని పెళ్లికి అడ్డుపడతారని మహిళ అడ్డు చెప్పినట్టు ఆధాలున్నాయని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి వారం రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తయరవుతుండగా అతనిపై అత్యాచారం, మోసం కేసు దాఖలు చేసిందని కోర్టు వివరించింది. దీంతో 20ఏళ్ళ నాటి ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఇవాళ సుప్రీం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Related Posts