లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బిహార్‌లో మూడో దశ పోలింగ్.. 78 స్థానాలకు ఎన్నికలు

Published

on

Bihar Assembly elections : బిహార్‌లో మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది.  తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. తుది దశలో భాగంగా రాష్ట్రంలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2కోట్ల 34లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మూడో విడతలో 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తుది దశ అసెంబ్లీ స్థానాలతో పాటు వాల్మకీ నగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
ఈ దశలో మొత్తం 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మంత్రి వర్గంలో 12మంది మంత్రులు కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. ఈనెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఎన్‌డీఏ వైపు ఓటర్లు మొగ్గుచూపుతారా? :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ల ప్రచార వ్యూహాలతో బిహార్‌ ఓటర్ల గాలి మళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ నితీశ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర భావోద్వేగానికి గురిచేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కుటుంబ పాలన లేకుండా ఉండాలంటే నితిశ్‌కుమార్‌నే మరోసారి గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రచారంలో ఓటర్లను కోరారు. దీంతో ఇక్కడ ఓటర్ల ఎన్‌డీఏ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

నితీశ్ కుమార్ ర్యాలీలో ‘లాలూ జిందాబాద్’ నినాదాలు, తిక్కరేగేసరికి…


ఫలితాల రోజు కూడా జైల్లోనే లాలూ!
బిహార్ అసెంబ్లీ ఫలితాల రోజైనా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి బయటకు వస్తారన్న ఆశలకు గండిపడింది. దుమ్కా ఖజానా కేసులో నవంబర్ 9 నాటికి లాలూ శిక్షాకాలం సగం పూర్తికానుంది.
అయితే సీబీఐ తన వాదనలను కోర్టు ముందుంచకపోవడంతో.. కేసు విచారణను ఝార్ఖండ్ హైకోర్టు నవంబర్‌ 27కు వాయిదా వేసింది. ఫలితాల నాటికి లాలూ బయటకు రాలేరన్న వార్త ఆర్జేడీ కార్యర్తల్ని నిరాశకు గురి చేస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *