లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రిలీజ్‌కి ముందే రికార్డులు సెట్ చేస్తున్నారు!

Published

on

Tollywood Upcoming Crazy Movies: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్).. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. BB3 శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమిని టివి రూ. 11.5 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే రూ. 9 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ లెక్కన రూ. 20.5 కోట్లకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం..


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’.. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.. తాజాగా శాటిలైట్ బిజినెస్ కూడా పూర్తయిపోయింది. ‘వకీల్ సాబ్’ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమిని టివి రూ. 16.5 కోట్లకు దక్కించుకుందని సమాచారం.


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. ‘గీతగోవిందం’ ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో.. 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.. ‘సర్కారు వారి పాట’.. జనవరి నుంచి దాదాపు 50 రోజులపాటు అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ క్రేజీ ప్రైజ్‌కు స్టార్ మా సొంతం చేసుకుంది.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ‘పుష్ప’ శాటిలైట్ హక్కులను కూడా స్టార్ మా భారీ ధరకు దక్కించుకుంది.

షూటింగ్ స్టార్ట్ కాక ముందే హైయ్యెస్ట్ రేటుకి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయంటే ఈ క్రేజీ మూవీస్ పై ఎలాంటి అంచనాలున్నాయో.. ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో కొత్తగా చెప్పక్కర్లేదు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *