లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గరం గరం పిజ్జా చల్లగా అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా

Published

on

hot pizza under cold water : వేడి వేడి పదార్థాలు తినడం కొంతమందికి అలవాటు. కానీ..మరికొంతమందికి అలా తినడం కష్టంగా ఉంటుంది. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి నోట్లో వేసుకుంటుంటారు. కానీ..ఓ వ్యక్తి వేడిగా ఉన్న పిజ్జాను తినేందుకు చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. తన భర్త ఏం చేస్తున్నాడో చూడండి..అంటూ భార్య ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

పిజ్జాను ఓవెన్ నుంచి తీసి గరంగరంగా తింటారు. కొద్దిగా చల్లగా అయ్యే వరకు ఉండి..తర్వాత కొంతమంది తింటారు. కానీ..ఓ వ్యక్తి మాత్రం పిజ్జా చల్లగా అవడానికి నల్లా కింద పెట్టాడు. కొన్నాళ్లుగా తన భర్త ఈ విధంగా చేస్తున్నాడంటూ..ఆమె పోస్టు చేశారు. నల్లా విప్పి నీటి కింద పిజ్జాను చల్లబర్చడం కరెక్టు అని తన భర్త నమ్ముతాడని వెల్లడించింది. తన అభిప్రాయం కాదని తెలిపింది.

కాలేజీలో తన భర్త, తాను ఓవెన్ పిజ్జాలు తయారు చేస్తామని, కానీ..పిజ్జా ముక్కలను నీటి కింద పెట్టి..తింటాడని పేర్కొంది. రుచి ఏ మాత్రం పోలేదని..అలాగే ఉందని అంటాడని తెలిపింది. ట్విటర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనికి 2 వేల 400 మంది వ్యూయర్స్ వచ్చాయి. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది చాలా నేరమని, సీరియల్ కిల్లర్ గా అభివర్ణించారు.